ఎల్‌జీ‌బీటీక్యూపై బీజేపీ ఎమ్మేల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన Sonam Kapoor

ABN , First Publish Date - 2021-12-30T17:56:18+05:30 IST

ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

ఎల్‌జీ‌బీటీక్యూపై బీజేపీ ఎమ్మేల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..  కౌంటర్ ఇచ్చిన Sonam Kapoor

ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ సంఘంలోని సభ్యులు ఇప్పటికే ఆయన మాటలను ఖండించగా.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఆయనపై విమర్శలు చేసింది.


మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్శిటీ చట్టం, 2016 (మూడో సవరణ) బిల్లుకు సంబంధించి ఎల్‌జీబీటీక్యూలను కమ్యూనిటీ సభ్యులను యూనివర్సిటీ బోర్డులలో చేర్చాలని ఆ సంఘం కోరింది. ముంగంటివార్ ఈ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ.. ‘మీరు లెస్బియన్లు, స్వలింగ సంపర్కులను సభ్యులుగా తీసుకోబోతున్నారా? దీనిపై జాయింట్ మెడికల్ కమిటీని ఏర్పాటు చేయకూడదు? ఇందులో ద్విలింగ, అలైంగిక సంబంధాల గురించి ప్రస్తావించారు. అయితే, ఎవరూ లేరు. ఇంకా వీటిని ఎవరూ నిర్వచించలేద’ని కామెంట్స్ చేశారు. 


అంతేకాకుండా ముంగటివార్ అలైంగిక సంబంధాలను ప్రశ్నిస్తూ.. ‘అలైంగిక సంబంధాలు. దాన్ని ఎవరూ నిర్వచించలేదు. కాబట్టి ఒక వ్యక్తి జంతువుతో అలైంగిక సంబంధాలు కలిగి ఉంటే, ఆ జంతువు వచ్చి అలైంగిక సంబంధం ఉందని ధృవీకరింస్తుందా? అసలేం ఏం జరుగుతోంది?’ అంటూ తెలిపారు.


సోషల్ మీడియాలో వైరల్ అయిన ముంగంటివార్ వ్యాఖ్యలను తప్పుబట్టింది సోనమ్ కపూర్. మంత్రి వ్యాఖ్యలపై అవును, వి ఎగ్జిస్ట్ ఇండియా అనే వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేసింది ఈ బ్యూటీ. దానిపై తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘అజ్ఞానం, నిరక్షరాస్యత, అసహ్యకరం’ అని రాసుకొచ్చింది.Updated Date - 2021-12-30T17:56:18+05:30 IST