నేను పబ్లిక్‌లోనే తప్పులు చేశా.. అయినప్పటికీ..: Sara Ali Khan

ABN , First Publish Date - 2021-12-14T17:28:25+05:30 IST

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి సారా అలీఖాన్. ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ సినిమాలతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా..

నేను పబ్లిక్‌లోనే తప్పులు చేశా.. అయినప్పటికీ..: Sara Ali Khan

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి సారా అలీఖాన్. ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ సినిమాలతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా.. ఎంతోమంది యువతకి కలల రాకుమారిగా మారిపోయింది. ఈ బ్యూటీ తాజాగా అక్షయ్ కుమార్, తమిళ స్టార్ ధనుష్‌తో కలిసి ‘అత్రంగి రే’ చేస్తోంది. డిసెంబర్ 24న ‘జీ5’లో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంది ఈ తార.


అందులో మాట్లాడుతూ.. ‘ఎవరైనా నా వైపు చూడడానికి కారణం నేను నిజాయతీగా ఉండడమేనని గ్రహించాను. ప్రతి విషయంలో బాగా ఆలోచించడం, ఏ మాట్లాడుతున్నానో చెక్ చేసుకోవడం వంటివి చేస్తే ఎవరు నన్ను పట్టించుకోరు. అందుకే, నేను దాని గురించి ఆలోచించను. నేను చాలా తప్పులు చేశాను. కానీ వాటికి సాపేక్షత ఉంటుంది. కొన్నైతే పబ్లిక్‌‌లో కూడా చేసాను అయితే వాటి నుంచి చాలా నేర్చుకున్నాన’ని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా సారా సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘నేను నా మూడ్స్‌ని చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుంటాను. అంతేకానీ, వాటికి నా మూడ్స్‌ని కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వను. అందుకే నీకు నచ్చితే స్టోరీ పెట్టూ.. లేకపోతే పెట్టకు. కానీ నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోన‌’ని తెలిపింది.

Updated Date - 2021-12-14T17:28:25+05:30 IST