వారు అలా ట్రీట్ చేయడం తట్టుకోలేక ఏడ్చేదాన్ని.. అది నా తల్లిదండ్రులను..: ‘జెర్సీ’ బ్యూటీ
ABN, First Publish Date - 2021-12-29T18:48:54+05:30
టీవీ షోలతో కెరీర్ ప్రారంభించి హృతిక్ రోషన్ హీరోగా చేసిన ‘సూపర్ 30’తో బాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్...
టీవీ షోలతో కెరీర్ ప్రారంభించి హృతిక్ రోషన్ హీరోగా చేసిన ‘సూపర్ 30’తో బాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ భామ తాజాగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ హీరో నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రిమేక్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ బ్యూటీ.
మృణాల్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ప్రారంభంలో చాలామంది నాతో ఢిపరెంట్‌గా ప్రవర్తించేవాళ్లు. అది తట్టుకోలేక ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. ఇది నచ్చట్లేదని నా తల్లిదండ్రులకు చెప్పా. నా తల్లిదండ్రులకి బాధ కలిగించింది. కానీ ఇప్పటి గురించి కాదు. పదేళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలో ఆలోచించూ. నీ సక్సెస్ అయితే చాలామందికి ఇన్‌స్పిరేషన్ అవుతావు. నువ్వు సాధించగలవు అని వారు చెప్పేవారు.
అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేనేంతో అదృష్టవంతురాలిని. నేనేం చేయాలేను అనుకున్నప్పుడు, నేనేదైన చేయగలనని నన్ను ఉత్సాహ పరిచార’ని చెప్పింది.
అయితే, ఒక ఫెయిల్ అయిన క్రికెటర్ తన కొడుకు కోసం ఏం చేశాడనే స్టోరీతో వస్తున్న ‘జేర్సీ’ మూవీ డిసెంబర్ 31న విడుదల కావాల్సింది. కానీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. కాగా మూవీ టీం త్వరలోనే మరో తేదిని ప్రకటించే అవకాశం ఉంది.