అనుకోకుండా జరిగిన ఆ ఘటనతో.. Malaika Arora పై ట్రోలింగ్
ABN , First Publish Date - 2021-12-27T17:55:41+05:30 IST
నలభై ఏడేళ్ల వయస్సులోనూ ఫ్యాషన్తో అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా...

నలభై ఏడేళ్ల వయస్సులోనూ ఫ్యాషన్తో అభిమానులను అలరించడంలో ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. స్టైల్ ఐకాన్గానే కాకుండా శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ ఉంచుకుంటూ అందరిని ఆకర్షిస్తుంటుంది ఈ భామ. అయితే అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో విపరీతంగా ట్రోలింగ్కి గురైంది ఈ ‘కెవ్వుకేక’ భామ.
తాజాగా మలైకా గ్రీన్ డ్రెస్లో బోల్డ్ అవుట్ ఫిట్తో హై హీల్స్ ధరించింది కనిపించింది. ఆ సందర్భంలో కారులో నుంచి కిందకి దిగుతూ ఆ హీల్స్ని బ్యాలెన్స్ చేయలేక కిందపడబోయింది. అంతలోనే సంభాలించుకొని నిలబడింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్గా మారింది. దీంతో ఆ ముదురు భామని వీపరీతంగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.
‘ఇప్పుడు ఫ్యాషన్ చేయి’ అంటూ కొందరూ.. ‘మలైకా మామ్ మళ్లీ వెళ్లి ఉంటే, ఘోరమైన అవమానంగా అయ్యి ఉండేద’ని మరికొందరూ.. ‘మరొకసారి హైహీల్స్ ధరించూ’ అని ఇంకొందరూ.. ‘ముసలితనం వచ్చిన తర్వాత హైహీల్స్ వేసుకుంటే అలాగే జరుగుతుంది’ అని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.