నేను బాయ్‌ఫ్రెండ్స్‌ని కాదు.. బిర్యానీని తయారు చేస్తా: Karisma Kapoor

ABN , First Publish Date - 2021-12-29T17:47:22+05:30 IST

కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి కరిష్మాకపూర్. ప్రస్తుతానికి సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న..

నేను బాయ్‌ఫ్రెండ్స్‌ని కాదు.. బిర్యానీని తయారు చేస్తా: Karisma Kapoor

కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి కరిష్మాకపూర్. ప్రస్తుతానికి సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడూ తన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది.


తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్‌ని పోస్ట్ చేసింది కరిష్మా. అందులో రెండు జడలు వేసుకుని, బకెట్ క్యాప్ పెట్టుకుని, బిర్యానీ ప్లేట్‌తో కూర్చొని ఉంది. దానికి ‘నేను బాయ్‌ఫ్రెండ్స్‌ని చేయను.. బిర్యానీని చేస్తానం’టూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ వైరల్‌గా మారింది. దీనిపై సంజయ్ కపూర్, అమృతా అరోరా, నటాషా పూనమ్‌వాలా వంటి ప్రముఖులు స్పందించి నవ్వుతున్న ఏమోజీలను పోస్ట్చ చేశారు.


ఫ్యాన్స్‌కి సైతం ఈ పోస్ట్‌కి పెట్టిన క్యాప్షన్ బాగా నచ్చింది. దీంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘హహహా క్రేజీ క్యాప్షన్, లవ్ ఇట్ కరిష్మా కపూర్’ అని ఒకరు రాయగా.. మరొకరు ఇది ఆమె ‘2022 నినాదం’ అన్నారు. ‘మీ అందమైన లుక్స్‌తో ఎప్పుడూ పిచ్చివాడ్ని అవుతుంటా కరిష్మా కపూర్’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ‘నన్ను కూడా బిర్యానీకి పిలువచ్చు కదా’, ‘ఇదంతా మీరే చేశారా.. నేను నమ్మను’ అంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఈ బాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్స్‌ని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2021-12-29T17:47:22+05:30 IST