అడుక్కున్నేవాళ్లు కూడా ఇలా లేరు.. వరుణ్‌తేజ్‌ హీరోయిన్‌పై ట్రోలింగ్

ABN , First Publish Date - 2021-12-28T16:11:00+05:30 IST

టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొంది.. అనంతరం బాలీవుడ్‌లో సెటిల్ అయిన బ్యూటీ దిశా పటానీ...

అడుక్కున్నేవాళ్లు కూడా ఇలా లేరు.. వరుణ్‌తేజ్‌ హీరోయిన్‌పై ట్రోలింగ్

టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొంది.. అనంతరం బాలీవుడ్‌లో సెటిల్ హీరోయిన్‌గా అయిన బ్యూటీ దిశా పటానీ. అక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ భామ నటనకే కాకుండా స్టైలిష్ డ్రెసింగ్‌కి సైతం ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడూ మంచి ష్యాషన్‌తో అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే తాజాగా డ్రెసింగ్ విషయంలో ట్రోలింగ్ గురైంది ఈ బ్యూటీ.


ఇటీవలే ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది దిశా. దీనికి సంబంధించిన వీడియోని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఈ తార బ్రౌన్ టాప్‌తో బ్లూ రిప్‌డ్ జీన్స్ వేసుకొని ఉంది. దీంతో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.


‘అడుక్కునేవాళ్లు కూడా ఇలా వేసుకోరు’ అంటూ ఒకరు.. ‘పొకిరిలాగా కనిపిస్తున్నావ్’ అని ఇంకొకరు.. మరొకరైతే వెటకారంగా ‘ఎంత పేదవాళ్లు.. నా దేశానికి ఏమైంది. ఇలా చిరిగిన బట్టలు వేసుకుంటున్నారు’ అంటూ కామెంట్ పెట్టగా.. ‘ఎందుకు ప్రతిసారి ఇలా ఒళ్లంతా చూపిస్తారు’ అంటూ వరుసగా విమర్శలు గుప్పించారు నెటిజన్లు.

Updated Date - 2021-12-28T16:11:00+05:30 IST