ఆ సినిమాకి స్టోరీ, హీరోయిన్ సిద్ధంగా లేదు.. పెళ్లి గురించి Sidharth Malhotra ఫన్నీ కామెంట్స్

ABN , First Publish Date - 2021-11-09T15:42:49+05:30 IST

Bollywood Actor Sidharth Malhotra Comments on marriage He do not have the cast ready for that film production

ఆ సినిమాకి స్టోరీ, హీరోయిన్ సిద్ధంగా లేదు.. పెళ్లి గురించి Sidharth Malhotra ఫన్నీ కామెంట్స్

బాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన తాజా చిత్రం ‘షేర్ షా’ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫన్నీ కామెంట్స్ చేశాడు ఈ యంగ్ హీరో.


‘ ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి ప్రణాళికలు లేవు. దానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. ఆ సినిమా నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. నా దగ్గర కథ, స్క్రిప్ట్, క్యాస్ట్ సిద్ధంగా లేవు. అది జరిగినప్పుడు అందరికీ తెలియజేస్తాన’ని సిద్ధార్థ్ చెప్పాడు. ఈ విజయంతో తన బాధ్యత ఇంకా పెరిగిందని, నేను సలహాలు ఇచ్చినప్పుడు చిత్ర బృందం లేదా దర్శకుడికి తీసుకునే అవకాశం పెరిగిందని ఈ నటుడు తెలిపాడు. అదే సలహాని మూడేళ్ల క్రితం ఇచ్చుంటే వారి పరిగణలోకి తీసుకునేవారు కాదని పేర్కొన్నాడు. ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తున్న ఈ 36 ఏళ్ల నటుడు నటి కైరా అద్వానీతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యంగ్ హీరో ‘మ్యారేజ్’కి సంబంధించిన కథ, హీరోయిన్ గురించి ఎప్పుడూ తెలియజేస్తాడో చూద్దాం.

Updated Date - 2021-11-09T15:42:49+05:30 IST