పాము ఎలా కాటేసిందో చెప్పిన Salman Khan

ABN , First Publish Date - 2021-12-27T16:59:18+05:30 IST

క్రిస్మస్, పుట్టిన రోజుల వేడుకల కోసం పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌కి వెళ్లగా పాము కాటేసిన విషయం తెలిసిందే. అనంతరం నేవి ముంబైలోని ఎంజీఎమ్ హాస్పిటల్‌లో చేర్చగా చికిత్స అనంతరం..

పాము ఎలా కాటేసిందో చెప్పిన Salman Khan

క్రిస్మస్, పుట్టిన రోజుల వేడుకల కోసం పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌కి వెళ్లగా పాము కాటేసిన విషయం తెలిసిందే. అనంతరం నేవి ముంబైలోని ఎంజీఎమ్ హాస్పిటల్‌లో చేర్చగా చికిత్స అనంతరం ఆరు గంటల తర్వాత డిశార్చీ అయ్యాడు. ప్రస్తుతానికి ఈ నటుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అనంతరం పాము తనని ఎలా కాటేసిందో ఈ ‘దబాంగ్’ స్టార్ వెల్లడించాడు.


ఓ మీడియాతో సల్మాన్ మాట్లాడుతూ.. ‘నా ఫామ్‌హౌస్‌లోకి అనుకోకుండా ఓ పాము వచ్చింది. దీంతో దాన్ని ఓ కర్రతో బయటికి పంపడానికి ప్రయత్నించా. కానీ అది మెల్లగా నా చేతి వరకు వచ్చింది. నేను దాన్ని బయటికి వేయడానికి పట్టకున్నాను. అయితే అది నన్ను మూడుసార్లు కాటేసింది. అది ఒక రకమైన విషసర్పం. 6 గంటల పాటు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జీ అయ్యాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాన’ని తెలిపాడు.


అయితే రెండు గ్రూపుల డాక్టర్స్ సల్మాన్‌కి చికిత్స అందించినట్లు, ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని ఓ డాక్టర్ తెలిపాడు. కాగా, ఆయన హాస్పిటల్ బెడ్‌పై ఉన్న పిక్‌ని ఓ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో ఆయన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు.Updated Date - 2021-12-27T16:59:18+05:30 IST