Jacqueline Fernandez రింగుల జుట్టు సీక్రెట్ చేప్పేసిన Akshay Kumar.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2021-11-16T21:55:19+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎంత ఫన్నీగా ఉంటారో తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటులకి సంబంధించి ఫోటోలు, వీడియోలని షేర్ చేసి..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎంత ఫన్నీగా ఉంటారో తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటులకి సంబంధించి ఫోటోలు, వీడియోలని షేర్ చేసి, వాటికి ఫన్నీగా క్యాప్షన్స్ ఇస్తుంటాడు ఈ నటుడు. ఆయన నటించిన చిత్రం ‘సూర్యవంశీ’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకోగా.. ప్రస్తుతం ‘రామసేతు’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా తాజాగా షెడ్యూల్ డమన్‌లో జరుగుతుండగా..షూటింగ్ గ్యాప్‌లో హెలికాప్టర్ రైడ్‌కి వెళ్లారు అక్షయ్, జాక్వెలిన్. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ హీరో. హెలికాప్టర్‌లో జుట్టుని ఎలా రింగులుగా మార్చకోవాలో జాక్వెలిన్ చూసి నేర్చుకోండి అంటూ.. తన సినిమా హీరోయిన్ రింగుల జుట్టు రహస్యం గురించి తెలిపాడు ఈ స్టార్. అది నచ్చిన ఎంతోమంది అభిమానుల లైక్స్, కామెంట్స్ చేయడంతో.. ఇది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మీరు ఓ సారి ఆ వీడియోని చూసేయండి..