బైకు... విక్రమ్‌ ఫైటు

ABN , First Publish Date - 2021-10-04T07:32:53+05:30 IST

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు...

బైకు... విక్రమ్‌ ఫైటు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తయినట్టు లోకేష్‌ కనగరాజ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘రెండో షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తి చేశాం. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాం’’ అని తెలిపారు. కమల్‌ బైక్‌పై కూర్చొని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా ఫైట్‌ మాస్టర్లు అన్బు-అరివు, సినిమాటోగ్రాఫర్‌ గిరీశ్‌ గంగాధరన్‌తో ఫొటో దిగారు. ఈ షెడ్యూల్‌లో బైక్‌ ఛేజింగ్‌ యాక్షన్‌ సీన్లు తీశారట. అనిరుద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌. మహేంద్రన్‌తో కలసి కమల్‌ నిర్మిస్తున్నారు.


Updated Date - 2021-10-04T07:32:53+05:30 IST