సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా మృతి

ABN, First Publish Date - 2021-09-02T18:49:05+05:30

బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా మృతి చెందాడు. ప్రముఖ టీవీ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా మృతి చెందాడు. ప్రముఖ టీవీ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ్ వయసు 40 సంవత్సరాలు. ఆయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఈరోజు (సెప్టెంబర్  2) ఉదయం గుండెపోటు రావడంతో సిద్ధార్థ్‌ను ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రమవడంతో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. తన కెరీర్‌ని మోడల్‌గా షోబిజ్‌లో ప్రారంభించిన ఆయన 'బాలికా వధూ'లో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే టెలివిజన్ షో 'బాబుల్ కా ఆంగన్ చూటే నా'లో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత 'జానే పేచానే సే … యే అజ్ఞబ్బి','లవ్ యు జిందగీ' వంటి కార్యక్రమాలలో కనిపించాడు. ఇక 2014లో కరణ్ జోహార్ నిర్మించిన 'హంప్టీ శర్మ కి దుల్హనియా' మూవీతో సిద్ధార్థ్ శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.  

Updated Date - 2021-09-02T18:49:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!