సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నెట్ టాప్ ధరించిన నాటీ బ్యూటీ... నాటు కామెంట్స్‌తో చెలరేగిన నెటిజన్స్!

ABN, First Publish Date - 2021-12-17T21:57:45+05:30

సొషల్ మీడియా ఊపందుకున్నాక సెక్సీ సెలబ్రిటీల కవ్వింపులు ఎక్కువైపోయాయి. అదే సమయంలో, నెటిజన్ల కసిరింపులు కూడా నిర్ధాక్షిణ్యంగా పెరిగిపోతున్నాయి. ఎవర్ని ట్రోల్ చేద్దామని చూసే జనం రోజురోజుకి పెరిగిపోతున్నారు. మరోవైపు, తమని ఎంతగా ట్రోల్ చేసినా చూపరుల్ని రెచ్చగొట్టే రచ్చ భామలు కూడా శ్రుతి మించుతూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొషల్ మీడియా ఊపందుకున్నాక సెక్సీ సెలబ్రిటీల కవ్వింపులు ఎక్కువైపోయాయి. అదే సమయంలో, నెటిజన్ల కసిరింపులు కూడా నిర్ధాక్షిణ్యంగా పెరిగిపోతున్నాయి. ఎవర్ని ట్రోల్ చేద్దామని చూసే జనం రోజురోజుకి పెరిగిపోతున్నారు. మరోవైపు, తమని ఎంతగా ట్రోల్ చేసినా చూపరుల్ని రెచ్చగొట్టే రచ్చ భామలు కూడా శ్రుతి మించుతూనే ఉన్నారు.


బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ గురించి కొత్తగా చెప్పాలా? ఆమె వీలైనప్పుడల్లా హాట్ లుక్స్‌తో రెచ్చిపోవటం, నెటిజన్స్ ఆమెని ఇష్టానుసారం ట్రోల్ చేయటం రెగ్యులర్‌గా జరిగే వ్యవహారమే. అయితే, తాజాగా ఉర్ఫీ కుర్రాళ్లని మరోసారి ఉసూరుమనిపించింది. బ్లూ టాప్‌తో, వైట్ ప్యాంట్‌తో సోకుల్ని సంధించింది. చాలా మంది ఉర్ఫీ అందాల షోకి మెస్మరైజ్ అయినప్పటికీ కొందరు నెటిజన్స్ మాత్రం ఆమె ధరించిన నెట్ మీద నాటీ కామెంట్స్ చేశారు!


బ్లూ టాప్, వైట్ ప్యాంట్ ధరించిన ఉర్ఫీ స్టైలిష్‌గానే కనిపించింది. అయితే, చూసే వారి కళ్లకి వల వేద్దామనుకుందో ఏమోగానీ... మెడ నుంచీ నడుము దాకా... యద మీదుగా... వల లాంటి నెట్ టాప్ అలంకరించుకుంది! సొషల్ మీడియా రసికుల కళ్లు దానిపైనే పడ్డాయి. వెంటనే కామెంట్ల వరద మొదలైంది. ఒకరు ఆమె నెట్ టాప్‌ని పళ్ల సంచీతో పోల్చారు. మరోకరు చేపలు పట్టే వలలో అందాల పావురం చిక్కిందని ఛమత్కరించారు. ఇంకొకరు దోమతెర ఎందుకు ధరించావని ఆటపట్టించారు. ఓ ఇన్‌స్టాగ్రామర్ అయితే, ‘‘చేపలు పట్టే వారికి తమ వల తిరిగి కావాలట!’’ అంటూ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించాడు!    



Updated Date - 2021-12-17T21:57:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!