పాత పిక్‌ని ఎడిట్ చేసిన నెటిజన్.. బిగ్‌బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2021-12-29T16:14:37+05:30 IST

బిగ్‌బాస్ 14, టీవీ నటిగా బాగా పాపులారిటీ సాధించిన నటి రుబినా దిల్లాక్.. సోషల్ మీడియాలో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది...

పాత పిక్‌ని ఎడిట్ చేసిన నెటిజన్.. బిగ్‌బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్

బిగ్‌బాస్ 14, టీవీ నటిగా బాగా పాపులారిటీ సాధించిన నటి రుబినా దిల్లాక్.. సోషల్ మీడియాలో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్సీ, బోల్డ్, అందమైన ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. బిగ్‌బాస్ షోలో స్ట్రాంగ్ ఓపినియన్స్, ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవల కారణంగా బాగా పాపులారిటీని సాధించింది ఈ బ్యూటీ.


రుబినా స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే చాలామంది ఎంతో ఇష్టం. అందుకే ఎంతోమంది ఫ్యాన్స్ ఈ బ్యూటీ పిక్స్ వారి సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన పని ఈ భామకి కోపం తెప్పించింది.


ఎడిట్ చేసిన రుబినా పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ ఫ్యాన్. అది ఈ భామ పాత ఫోటో. అందులో ఈ బ్యూటీ ఫేస్ మీద గాయం ఉన్నట్లు కనిపించింది. దానికి కష్టమనేది నిజమంటూ రాసుకొచ్చాడు.


అయితే ఈ పిక్ రుబినాకి నచ్చలేదు. దీంతో ఆ పిక్ షేర్ చేసి ‘ఈ పిక్‌ని ఎడిట్ చేసిన జీనియస్‌ని కలవాలని ఉంది..  జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నాడో తెలుసుకోవాలి’ అంటూ రాసుకొచ్చింది.

Updated Date - 2021-12-29T16:14:37+05:30 IST