సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘భవాయి’ని నిషేధించి, ప్రతీక్‌ను అరెస్ట్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-09-21T06:26:53+05:30

‘స్కామ్‌ 1992’చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటుడు ప్రతీక్‌ గాంధీ. తాజాగా ఆయన నటించిన ‘భవాయి’ చిత్రం వివాదాస్పదమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్కామ్‌ 1992’చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటుడు ప్రతీక్‌ గాంధీ. తాజాగా ఆయన నటించిన ‘భవాయి’ చిత్రం వివాదాస్పదమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాల్లో హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసారని నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ‘భవాయి’ సినిమాపై నిషేధం విధించి, ప్రతీక్‌ను అరెస్ట్‌ చేయాలంటూ కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రతీక్‌ ‘‘కొన్ని సన్నివేశాల ఆధారంగా కథపై అంచనాకు రాకూడదు. ఇందులో రావణ పాత్రను గొప్పగా చూపించే దృశ్యాలు ఏవీ లేవు’ అని చెప్పారు. ఈ చిత్రానికి తొలుత ‘రావణ్‌ లీలా’ అనే టైటిల్‌ పెట్టారు. వివాదాస్పదం కావడంతో  ‘భవాయి’గా మార్చారు. అక్టోబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 


Updated Date - 2021-09-21T06:26:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!