మంచి చేస్తే ఎవరూ రాయలేదు.. కానీ: టైగ‌ర్ ష్రాఫ్ త‌ల్లి

ABN , First Publish Date - 2021-06-04T21:21:37+05:30 IST

త‌న కొడుకు మంచి చేస్తే ఎవ‌రూ పెద్ద‌గా పట్టించుకోలేదు. కానీ.. పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద హ‌డావుడి చేశారంటూ బాధ‌ను వ్య‌క్తం చేశారు బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ త‌ల్లి ఆయేషా.

మంచి చేస్తే ఎవరూ రాయలేదు.. కానీ:  టైగ‌ర్ ష్రాఫ్ త‌ల్లి

త‌న కొడుకు మంచి చేస్తే ఎవ‌రూ పెద్ద‌గా పట్టించుకోలేదు. కానీ.. పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద హ‌డావుడి చేశారంటూ బాధ‌ను వ్య‌క్తం చేశారు బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ త‌ల్లి ఆయేషా.  లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో టైగ‌ర్ ష్రాఫ్‌, దిశా ప‌టానీల‌పై ముంబై  పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై స్పందించ‌న ఆయేషా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కోసం త‌న కొడుకు ఆహారాన్ని అందిస్తే అప్పుడు ప‌ట్టించుకోని మీడియా వ‌ర్గాలు, అరెస్ట్‌పై మాత్రం పెద్ద హ‌డావుడి చేశారన్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాఫ్ హీరో పంతి 2 చిత్రంలో న‌టిస్తుండ‌గా, దిశా ప‌టాని ఏక్ విల‌న్ రిట‌ర్స్‌లో న‌టిస్తుంది. 

Updated Date - 2021-06-04T21:21:37+05:30 IST