సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఔను వాళ్లిద్దరు కలిసే ఉంటున్నారు!

ABN, First Publish Date - 2021-09-07T06:46:51+05:30

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రిచా చద్దా, అలీ ఫాజల్‌ పెళ్లి ఈ పాటికి అయిపోయి ఉండేది. అయితే మాయదారి కరోనా అడ్డు పడడంతో వాళ్ల ప్లాన్‌ అంతా పాడయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రిచా చద్దా, అలీ ఫాజల్‌ పెళ్లి ఈ పాటికి అయిపోయి ఉండేది. అయితే మాయదారి కరోనా అడ్డు పడడంతో వాళ్ల ప్లాన్‌ అంతా పాడయింది.  పెళ్లి వాయిదా పడింది. మనసులు కలసిన తర్వాత పెళ్లి అయితేనేం, కాకపోతేనేం అనుకున్నారో ఏమో వీళిద్దరు కలిసే ఉంటున్నారు. గత ఏడాది నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ‘మేమిద్దరం మంచి స్నేహితుల్లా కలసి పోయాం.  ఒకే ఇంట్లో అతనితో  ఉండడం నాకేమీ ఇబ్బంది అనిపించడం లేదు. అలీ మంచి కుక్‌. అప్పుడప్పుడు కిచెన్‌లో వెళ్లి మంచి వంటలు వండుతాడు. అయితే అతనితో వచ్చిన చిక్కు ఏమిటంటే పిల్లులంటే అతనికి ఇష్టం. నాకు అవంటే నచ్చదు. అప్పుడప్పుడు వాటి విషయంలో మేమిద్దరం గొడవ పడుతుంటాం. అంతే తప్ప మిగిలిన విషయాల్లో మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు’ అని ఓ ఆంగ్ల పత్రికకు రిచా వివరించింది.


Updated Date - 2021-09-07T06:46:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!