సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హిందీ ‘తడమ్‌’లో పోలీస్‌గా...

ABN, First Publish Date - 2021-09-07T06:52:31+05:30

సినిమాల్లో ఖాకీ చొక్కా వేసిన కథానాయికల జాబితాలో మృణాల్‌ ఠాకూర్‌ చేరబోతున్నారు. త్వరలో వెండితెరపై పోలీస్‌ అధికారిగా ఆమె కనిపించనున్నారు. తమిళ హిట్‌ ‘తడమ్‌’ను ఆదిత్యా రాయ్‌ కపూర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమాల్లో ఖాకీ చొక్కా వేసిన కథానాయికల జాబితాలో మృణాల్‌ ఠాకూర్‌ చేరబోతున్నారు. త్వరలో వెండితెరపై పోలీస్‌ అధికారిగా ఆమె కనిపించనున్నారు. తమిళ హిట్‌ ‘తడమ్‌’ను ఆదిత్యా రాయ్‌ కపూర్‌ కథానాయకుడిగా నిర్మాతలు ‘టీ-సిరీస్‌’ భూషణ్‌కుమార్‌, మురాద్‌ ఖెతానీ హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అందులో పోలీస్‌గా మృణాల్‌ ఠాకూర్‌ నటించనున్నారు. ‘‘ఇప్పటివరకూ నేను నటించిన పాత్రలకు భిన్నమైన పాత్ర చేస్తున్నా. నేను పోషించాలనుకున్న పాత్రల్లో పోలీస్‌ ఒకటి. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతోంది’’ అని మృణాల్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. తెలుగులో ‘రెడ్‌’ పేరుతో ‘తడమ్‌’ను హీరో రామ్‌ రీమేక్‌ చేశారు. అందులో నివేదా పేతురాజ్‌ పోలీస్‌గా నటించారు. అదే పాత్రను హిందీలో మృణాల్‌ ఠాకూర్‌ చేస్తున్నారన్నమాట. గతంలో ‘బాట్లా హౌస్‌’, ‘తూఫాన్‌’ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌కు భార్యగా కనిపించనున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.


Updated Date - 2021-09-07T06:52:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!