అక్టోబర్ 25.. ఈ తేదీని గుర్తుకు తెచ్చుకుని జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న Aryan Khan.. ఇంతకీ ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే..
ABN , First Publish Date - 2021-10-25T22:54:54+05:30 IST
ఆర్యన్ ఖాన్ జైలు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఒకవైపు బెయిల్ లభించక కస్టడీలోనే ఉంటూ అనేక శారీరిక ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదుర్కొంటున్నాడు. అవి చాలవన్నట్టు మానసికంగానూ బాద్షా తనయుడు కృంగిపోతున్నాడు. అక్టోబర్ 3న అరెస్టైన స్టార్ కిడ్ వారాల తరబడి ఆర్థర్ రోడ్డు జైలులో మగ్గుతున్నాడు...
ఆర్యన్ ఖాన్ జైలు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఒకవైపు బెయిల్ లభించక కస్టడీలోనే ఉంటూ అనేక శారీరిక ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదుర్కొంటున్నాడు. అవి చాలవన్నట్టు మానసికంగానూ బాద్షా తనయుడు కృంగిపోతున్నాడు. అక్టోబర్ 3న అరెస్టైన స్టార్ కిడ్ వారాల తరబడి ఆర్థర్ రోడ్డు జైలులో మగ్గుతున్నాడు. ‘మన్నత్’ని తలుచుకుని మన: శాంతి లేక విలవిలలాడుతున్నాడు. ఇక అక్టోబర్ 25వ తేదీన అయితే జూనియర్ ఖాన్ మరింత భావోద్వేగానికి గురయ్యాడట...
అక్టోబర్ 25 కింగ్ ఖాన్ ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన రోజు. అదే తేదీన ముప్పై ఏళ్ల క్రితం గౌరీ ఖాన్ని పెళ్లాడాడు షారుఖ్ ఖాన్. వారి తొలి సంతానమే ఆర్యన్ ఖాన్. మరి వారసుడు జైల్లో ఉంటే తల్లిదండ్రులు పెళ్లి రోజు వేడుకలు ఎలా జరుపుకుంటారు చెప్పండి? ఎస్ఆర్కే, గౌరీ ఎంతో డిస్టబ్డ్‌గా ఉన్నారు. ఇటు ఆర్యన్ ఖాన్ కూడా జైల్లో ఎంతో వేదనతో ఉన్నాడని కొందరు చెబుతున్నారు. మరికొందరైతే, అతను కన్నీళ్లు పెట్టుకున్నాడనీ... జైలు అధికారుల్ని ‘అమ్మా, నాన్నతో వీడియో కాల్ మాట్లాడతా’నంటూ అభ్యర్థించాడనీ... అంటున్నారు. జైల్లోని ఆర్యన్ ఖాన్ను గౌరీ ఖాన్ సందర్శించే అవకాశం కూడా ఉందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్ 25 మాత్రమే కాదు... జైల్లో ఉన్న ఆర్యన్ అక్టోబర్ 8వ తేదీని కూడా మిస్ అయ్యాడు. ఆ రోజు అతడి తల్లి గౌరీ ఖాన్ బర్త్ డే. ఇక త్వరలోనే అతడికి బెయిలు రాకపోతే నవంబర్ 1 నుంచీ న్యాయస్థానాలకి దీపావళి సెలవులు మొదలవుతాయి. అవి పూర్తి అవ్వాలంటే నవంబర్ 14 దాకా ఎదురు చూడాలి. అంతలోపు నవంబర్ 2న బాలీవుడ్ బాద్షా బర్త్ డే వచ్చేస్తుంది. నవంబర్ 13 ఆర్యన్ ఖాన్ బర్త్ డే కూడా ఉంది. ఇలా సంవత్సరంలోని పలు ప్రధానమైన రోజులన్నీ జైల్లోనే గడిపోయే ప్రమాదం పొంచి ఉంది. చూడాలి మరి, నెక్ట్స్ హియరింగ్‌లో షారుఖ్ తనయుడి బెయిల్ పిటీషన్‌పై బాంబే హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో...
