సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వైరల్‌గా మారిన Shah Rukh Khan పాత ఇంటర్వ్యూ.. అమ్మాయిలు, డ్రగ్స్ గురించి కొడుక్కు ఏం చెప్పాడంటే..

ABN, First Publish Date - 2021-10-04T20:03:14+05:30

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌‌లో సంచలనం సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌‌లో సంచలనం సృష్టిస్తోంది. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్‌ సహా మొత్తం 8 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆర్యన్ చాటింగ్ పై దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో ఆర్యన్ వ్యవహార శైలి, అతడి వ్యక్తిగత జీవితంపై బోలెడు మంది సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే షారూక్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కూడా వైరల్ అవుతోంది. 


ప్రముఖ జర్నలిస్ట్ సిమి గేర్‌వాల్‌‌కు గతంలో షారూక్ ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు షారూక్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. `నేను యవ్వనంలో చేయలేకపోయిన పనులన్నింటినీ నా కొడుకు ఆర్యన్ చేయాలి. అమ్మాయిలతో డేటింగ్ చేయవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని సిగరెట్లు కాల్చవచ్చు,  డ్రగ్స్ కూడా తీసుకోవచ్చు. తాను అన్ని రకాలుగానూ ఎంజాయ్ చేయవచ్చ`ని ఆ వీడియోలో షారుఖ్ సరదాగా అన్నాడు. ఆ వీడియో వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. షారుక్ చూపిన బాటలోనే కొడుకు నడిచాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-04T20:03:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!