సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పిల్లలతో సమయం గడపనందుకు చాలా చింతిస్తున్నాను : అమితాబ్

ABN, First Publish Date - 2021-09-24T15:43:33+05:30

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సూపర్ స్టార్ గా ఎదిగే క్రమంలో సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉండేవారు. ఆ టైమ్ లో ఆయనకి తన పిల్లలైన అభిషేక్, శ్వేతలతో టైమ్ స్పెండ్ చేయడమే కుదిరేది కాదు. అప్పట్లో అలా జరిగినందుకు ఇప్పుడు బిగ్ బీ తన విచారం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సూపర్ స్టార్ గా ఎదిగే క్రమంలో సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉండేవారు. ఆ టైమ్ లో ఆయనకి తన పిల్లలైన అభిషేక్, శ్వేతలతో టైమ్ స్పెండ్ చేయడమే కుదిరేది కాదు. అప్పట్లో అలా జరిగినందుకు ఇప్పుడు బిగ్ బీ తన విచారం వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఆయన హోస్ట్ గా చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13’ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎంతో బాధపడ్డారు. 


‘అభిషేక్, శ్వేతా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. నేను షూటింగ్స్ వల్ల తెల్లవారు ఝామునే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు ఆ ఇద్దరూ ఇంకా నిద్రపోతూ ఉండేవారు. షూటింగ్ అయిపోయి ఇంటికొచ్చే టైమ్ కి రాత్రి చాలా లేటయిపోయేది. అప్పుడు కూడా వారు నిద్రపోతూ ఉండేవారు. అప్పట్లో అలా జరిగినందుకు ఓ తండ్రిగా నేను చాలా బాధపడుతున్నాను’ అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-09-24T15:43:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!