సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రియాలిటీ షోలో సందడి చేయనున్న తారక్, ఆలియా భట్, SS Rajamouli

ABN, First Publish Date - 2021-12-24T23:53:33+05:30

రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం దేశంలోని పలు ప్రాంతాల మీడియాతో ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. ఆర్‌ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 19న ముంబైలో జరిపారు. చిత్ర బృందం ఇప్పటికే కపిల్ శర్మ షోలో పాల్గొంది. తాజాగా మరో షోలో సందడి చేయబోతోందని తెలుస్తోంది. 


బిగ్ బాస్-15 వీకెండ్ ఎపిసోడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ బృందం సందడి చేయబోతోందని తెలుస్తోంది. ఎస్ ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ఈ ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. చిత్ర బృందం అంతకు ముందే కపిల్ శర్మ షోలో పాల్గొంది. ఆ షోలో నాచో, నాచో పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్  స్టెప్పులేశారు. అయితే, బిగ్‌బాస్ షోలో చిత్ర బృందం ఏవిధంగా సందడి చేసిందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్ లో తారక్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, ఆలిసన్ డూడీ  కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2021-12-24T23:53:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!