అక్షయ్ కుమార్ హిస్టారికల్ మూవీపై కాంట్రవర్సీ.. ఆయన మా క్యాస్టంటే మా క్యాస్టంటూ..

ABN , First Publish Date - 2021-12-30T17:11:31+05:30 IST

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవలే ఈ నటుడు నటించిన ‘అత్రంగి రే’ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో రిలీజై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది...

అక్షయ్ కుమార్ హిస్టారికల్ మూవీపై కాంట్రవర్సీ.. ఆయన మా క్యాస్టంటే మా క్యాస్టంటూ..

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఇటీవలే ఈ నటుడు నటించిన ‘అత్రంగి రే’ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో రిలీజై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఆయన చేస్తున్న తదుపరి చిత్రం ‘పృథ్వీరాజ్’ జనవరి 22, 2022న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు గుర్జార్స్.


పృథ్వీరాజ్ రాజ్‌పుత్ కాదని, గుజ్జార్స్‌కి చెందినవాడని ఆ కమ్యూనిటీ నాయకులు చెబుతున్నారు. అందుకే రాజ్‌పుత్ అనే పేరు వాడితే రిలీజ్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వాదన నిజంకాదని రాజ్‌పుత్ కమ్యూనిటీ గట్టిగా వాదిస్తోంది. రాజ్‌పుత్ కర్ణీ సెనా నేషనల్ ప్రతినిధి విజయేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుజరాత్ ‌నుంచి వచ్చిన గౌచర్ తర్వాత గుర్జార్స్‌గా మారారు. ఇప్పుడు వాళ్లనే గుజ్రార్స్ అని పిలుస్తున్నారు. ఇది స్థలం పేరు కానీ క్యాస్ట్ పేరు కాద’ని చెప్పారు.


అయితే దీని గురించి గుజ్రార్ నాయకుడు హిమ్మత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాంద్ బద్రాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసో నవల ఆధారంగా తెరకెక్కుతుంది. అదే ఈ మూవీ టీజర్‌లో సైతం చూపించారు. చరిత్రలో లభ్యమైన శాసనాలను అధ్యయనం చేసిన తరువాత, పృథ్వీరాజ్ చౌహాన్ పాలన తర్వాత 400 సంవత్సరాల క్రితం ఆయన దీన్ని రాసినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. 16వ శతాబ్దంలో రాసో ఇతిహాసం కల్పితం. బజ్రా, రాజస్థానీ భాషల కలసి ఉండే ప్రింగల్ భాషలో ఆయన ఈ ఇతిహాసం రాశారం’టూ తెలిపారు.


గుజ్రార్స్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ హయాంలో సంస్కృత భాష వాడుకలో ఉండేదని, అయితే ఈ కవి వాడిన ప్రింగల్ భాష కాదని సింగ్ అన్నారు. 13వ శతాబ్దానికి ముందు రాజ్‌పుత్‌లు ఉనికిలో లేరనడానికి ఇవి చారిత్రక రుజువులు, మేము దీన్ని చారిత్రక వాస్తవాల నుంచి నిరూపించగా, ప్రస్తుతం రాజ్‌పుత్ కులాల ప్రజలు కూడా అంగీకరించారు. అందుకే వారు తమను తాము క్షత్రియులమని,  రాజపుత్రులం కాదని చెప్పుకున్నారు. నిజానికి దాద్రీ, గ్వాలియర్‌లలో గుర్జార్స్ చక్రవర్తి మిహిర్ భోజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, రాజ్‌పుత్‌లు మధ్యప్రదేశ్ హైకోర్టులో తమ కులాన్ని క్షత్రియులుగా చెప్పుకున్నారు.  


రాజ్‌పుత్ అనే పదాన్ని చాంద్ బర్దాయి కాలంలో మాత్రమే ఉపయోగించారు. పృథ్వీరాజ్ చౌహాన్ హయాంలో కాదు. పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి సోమేశ్వర్‌కు గుజ్జర్ కులంతో సంబంధం ఉంది. అందుకే ఆయన కొడుకు కూడా గుర్జార్స్ కావాల’ని ఆయన అన్నారు.


దీనికి ప్రతి వాదనగా షెకావత్ మాట్లాడుతూ.. ‘రాజ్‌పుత్ అనేది బిరుదు అని, కులం కాదని షెక్తావత్ అన్నారు. కానీ అప్పుడు రాజపుత్రులు వీరత్వానికి ప్రతీక. అంటే తమ భూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న నేల పుత్రులు.


13వ శతాబ్దంలో రాజ్‌పుత్ పదం గురించి ప్రస్తావించలేదు. రాముడు క్షత్రియుడు, కానీ అతను ఎప్పుడూ రాజపుత్రుడిగా గుర్తింపు లేదు. రాజ్‌పుత్ అనే బిరుదు అంటే రాజా కుమారుడు, రాజులు బిరుదు పొందే రాజకుటుంబాల మధ్య వారసత్వం కొనసాగుతుందని ఆయన తెలిపారు.


నేటి గుజరాత్, రాజస్థాన్‌లలో భాగమైన గుర్జర్లాండ్‌కు సోమేశ్వరుడు రాజు అని, అందుకే దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ను కలిపే గుర్జాధిపతి లేదా గుర్జరధీర్ అని ఆయన అన్నారు. గుర్జార్స్ వంశం గురించి ఉన్న  అన్ని వాదనలు నిరాధారమైనవి’ ఆయన అన్నారు.

Updated Date - 2021-12-30T17:11:31+05:30 IST