‘సూర్యవంశీ’లో పోలీస్ క్యారెక్టర్‌కి స్ఫూర్తి ఎవరో చెప్పిన Akshay Kumar
ABN , First Publish Date - 2021-11-16T17:49:12+05:30 IST
మహారాష్ట్రలో థియేటర్లు తిరిగి మొదలైన తర్వాత విడుదలైన ‘సూర్యవంశీ’ మంచి బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో

మహారాష్ట్రలో థియేటర్లు తిరిగి మొదలైన తర్వాత విడుదలైన ‘సూర్యవంశీ’ మంచి బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోలీసు ఆఫీసర్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పోషించిన ఆ పాత్రకి ఇన్‌స్పిరేషన్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలియజేశాడు.
అక్షయ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ముంబై సిటీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) విశ్వాస్ నంగారే పాటిల్ నుండి ప్రేరణ పొందాను. ఈ విషయం చెప్పడానికి ఏ మాత్రం సంకోచించను. ఎందుకంటే ఆయన చూడడానికి కఠినంగా కనిపించిన ఎన్నో మంచి పనులు చేస్తారు. కోవిడ్ సమయంలో సైతం ఆయన ఫ్రంట్‌లైన్ కార్మికుల బృందాన్ని ముందుండి నడిపించారు. అందుకే ఆయన కాక ఇంకేవరూ నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
