తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరిన నటి పూనమ్ పాండే.. భర్త అరెస్టు
ABN , First Publish Date - 2021-11-09T20:24:49+05:30 IST
బాలీవుడ్ నటి పూనమ్ పాండే, శామ్ బాంబే రెండేళ్ల సహజీవనం తర్వాత గతేడాది సెప్టెంబర్1న వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్..

బాలీవుడ్ నటి పూనమ్ పాండే, శామ్ బాంబే రెండేళ్ల సహజీవనం తర్వాత గతేడాది సెప్టెంబర్1న వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్.. ఆమెపై విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. తర్వాత భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. కానీ మళ్లీ మరోసారి వీరిద్దరూ గొడవ పడ్డారు.
భర్త దాడి చేశాడంటూ పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శామ్‌ను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. భర్త తన మొదటి భార్య అల్విరాతో తరచుగా మాట్లాడుతుండటం గురించి వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో కోపంతో రెచ్చిపోయిన శామ్, పూనమ్ జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇలా జరగడం మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు నన్ను ఇలాగే కొట్టాడు. అనంతరం ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. అయితే ఈసారి నన్ను చితకబాదాడు. దాదాపు హత్య చేసినంత పని చేశాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది పూనమ్.