సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

షూటింగ్‌లో గాయపడి హీరో నోటి నుంచి రక్తం.. ‘జెర్సీ’ వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-12-19T18:15:39+05:30

బాలీవుడ్‌లో స్టార్‌డమ్ ఉన్న హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఆయన సౌతిండియా రిమేక్ చిత్రం ‘కబీర్ సింగ్’ మంచి విజయాన్ని నమోదు చేయడమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో స్టార్‌డమ్ ఉన్న హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఆయన సౌతిండియా రిమేక్ చిత్రం ‘కబీర్ సింగ్’ మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా 300 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. ఈ నటుడు తాజాగా నటిస్తున్న మరో చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్ హీరో నాని హీరోగా నటించిన ఈ చిత్రం రిమేక్‌గా వస్తోంది.  ఈ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.


ఈ హీరో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో.. ఈ పాత్ర చేయడానికి గత రెండేళ్లుగా ఈ యంగ్ హీరోకి ఉన్న ప్యాషన్, డెడికేషన్‌కి ఇది అర్థం పడుతోంది. ఇందులో ఈ నటుడు రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తున్నాడు.


ఈ సినిమా షూటింగ్‌లో షాహిద్ కపూర్‌కి దెబ్బతగలగా.. 25 కుట్లు పడినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అది కూడా ఉంది. అందులో షూటింగ్ సందర్భంగా బాల్ బౌన్స్ కాగా ఈ నటుడి పెదవికి తగిలి రక్తం కారింది. అయినా ఎంతో కామ్‌గా ఉన్న ఈ యంగ్ హీరో తన గాయాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు.


ఈ వీడియోకి ‘ఈ సినిమాకి నా రక్తం చిందించాన’ని షాహిద్ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన ఈ స్టార్ హీరో భార్య మీరా చోప్రా సపోర్టుగా నిలిచింది. దీనికి ‘నీకున్న ధైర్యం, ఇష్టానికి ఇది నిదర్శనం. ఎంతో గర్వంగా ఉంది అన్న’ అంటూ షాహిద్ సోదరుడు ఇషాన్ కామెంట్ చేశాడు.



Updated Date - 2021-12-19T18:15:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!