లాక్డౌన్ మొత్తం 100 కేజీల బరువుతోనే... సినిమా కోసం ఓవర్ వెయిట్‌తో వెయిటింగ్!
ABN , First Publish Date - 2021-11-25T16:28:50+05:30 IST
ఓ క్రిమినల్ కథతో రూపొందిన ఈ రియల్ స్టోరీ కోసం అభీ చాలానే కష్టపడ్డాడు. అయితే, సినిమా కోసం స్మాల్ బీ కడుపేం మాడ్చుకోలేదు. రివర్స్ గేర్‌లో ఇష్టానుసారం స్వీట్లు తింటూ, టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అవస్థలు పడ్డాడు!
అభిషేక్ బచ్చన్ నెక్ట్స్ మూవీ ‘బాబ్ బిస్వాస్’. డిసెంబర్ 3న జీ5 ఓటీటీలో డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఓ క్రిమినల్ కథతో రూపొందిన ఈ రియల్ స్టోరీ కోసం అభీ చాలానే కష్టపడ్డాడు. అయితే, సినిమా కోసం స్మాల్ బీ కడుపేం మాడ్చుకోలేదు. రివర్స్ గేర్‌లో ఇష్టానుసారం స్వీట్లు తింటూ, టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అవస్థలు పడ్డాడు!
‘బాబ్ బిస్వాస్’ సినిమాలో ఓ బెంగాలీ హంతకుడుగా కనిపించబోతున్నాడు జూనియర్ బచ్చన్. ఒరిజినల్‌గా బాబ్ బిస్వాస్ ఎలా ఉండేవాడో అలానే కనిపించేందుకు కొన్ని నెలల క్రితం ఆయన బాగా బరువు పెరిగాడు. 100 నుంచీ 105 కేజీల మధ్య తూగేవాడట! అయితే, కోల్‌కతాలో సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుండగా... కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో లాక్డౌన్ వచ్చి నెత్తిన పడింది. వెంటనే ‘బాబ్ బిస్వాస్’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరో 10, 15 రోజుల పని పూర్తి చేస్తే చిత్రీకరణ అయిపోయే వేళ అభిషేక్ తిరిగి ముంబై వచ్చేశాడు...
‘బాబ్ బిస్వాస్’ షూటింగ్ తిరిగి మొదలయ్యేందుకు ఎదురు చూస్తోన్న అభిషేక్ బచ్చన్ నెలల తరబడి లాక్డౌన్లో తన బరువు అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. 100 కేజీలకు పైగా బరువుతో ఒక్కో రోజూ భారంగా గడిచేది. ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తివేయటం, సినిమా షూటింగ్‌లు మళ్లీ మొదలు కావటంతో ఆయన సినిమా పూర్తి చేసి అధిక బరువు బాధ నుంచీ త్వరత్వరగా బయటపట్టాడు! ‘బాబ్ బిస్వాస్’ ట్రైలర్లో మనం అభిషేక్ 100 కేజీల లుక్‌ని చూడవచ్చు...