సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ధనుష్ సినిమా... సల్మాన్ TITLE దానం!

ABN, First Publish Date - 2021-12-07T03:28:52+05:30

కొంత కాలం గ్యాప్ తరువాత తమిళ హీరో ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ ‘అత్రంగీ రే’. ఈ సినిమాలో ధనుష్‌తో పాటూ అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఇక హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ నటించింది. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ‘జీరో’ లాంటి డిజాస్టర్ ఫిల్మ్ తరువాత ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తీశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంత కాలం గ్యాప్ తరువాత తమిళ హీరో ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ ‘అత్రంగీ రే’. ఈ సినిమాలో ధనుష్‌తో పాటూ అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఇక హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ నటించింది. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ‘జీరో’ లాంటి డిజాస్టర్ ఫిల్మ్ తరువాత ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తీశాడు. 


‘అత్రంగీ రే’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ ఆనంద్ రాయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. నిజానికి తాము అనుకున్న టైటిల్ తమ కంటే ముందే సల్మాన్ రిజిస్టర్ చేయించాడని ఆయన వివరించాడు. ‘అత్రంగీ రే’ టైటిల్ ‘సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్’ పేరున రిజిస్టర్ అయ్యి ఉండటంతో ఆనంద్ ఎల్. రాయ్ బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని అప్రోచ్ అయ్యాడట. సల్మాన్ కూడా పెద్ద పేచీ ఏమీ పెట్టకుండానే ధనుష్, అక్షయ్, సారా స్టారర్ మూవీకి ‘అత్రంగీ రే’ టైటిల్ ఇవ్వటానికి ఒఫ్పుకున్నాడట. కానీ, ఒకే ఒక్క కండీషన్ పెట్టాడట!


తాను రిజిస్టర్ చేయించిన ‘అత్రంగీ రే’ టైటిల్ ఆనంద్ ఎల్. రాయ్‌కి సల్మాన్ ఇచ్చాడుగానీ... ఆ టైటిల్‌తో సినిమాని స్వయంగా ఆనంద్ మాత్రమే తీయాలని రూల్ పెట్టాడట! ‘తనూ వెడ్స్ మనూ’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన ఆనంద్ డైరెక్టర్ మాత్రమే కాదు. నిర్మాత కూడా. అందుకే, ఆయన నిర్మాతగా మరో దర్శకుడితో సినిమా తీస్తే ‘అత్రంగీ రే’ టైటిల్ ఇవ్వనన్నాడట సల్మాన్. కానీ, ఆనంద్ తానే స్వయంగా రూపొందిస్తున్నానంటూ హామీ ఇచ్చి టైటిల్ అరువు తెచ్చుకున్నానని పేరు వెనుక దాగిన కథ మొత్తం చెప్పుకొచ్చాడు...

Updated Date - 2021-12-07T03:28:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!