బాలీవుడ్‌లోకి ‘ఆకాశం నీ హద్దురా’

ABN , First Publish Date - 2021-07-12T15:52:01+05:30 IST

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా అనువాదం చేశారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు హీరో సూర్య. ఆసక్తికరమైన విషయమేమంటే..

బాలీవుడ్‌లోకి ‘ఆకాశం నీ హద్దురా’

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శూరరై పోట్రు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా అనువాదం చేశారు. కొవిడ్‌ సమయంలో థియేటర్స్‌ మూత పడటంతో ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా విడుదలై ప్రేక్షకులే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు హీరో సూర్య. తమిళంలో సినిమాను నిర్మించిన సూర్య, జ్యోతిక, రాజశేఖర్‌ పాండియన్‌ , అబన్‌డంతియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బాలీవుడ్‌లో సినిమాను నిర్మించబోతున్నారు. ఈ రీమేక్‌ ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తమిళంలో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుధా కొంగరనే బాలీవుడ్‌లోనూ డైరెక్ట్‌ చేయబోతున్నారు. మరి హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. డెక్కన్‌ ఎయిర్‌ వేస్‌ అధినేత ఆర్‌.గోపీనాథ్‌ గురించి రాసిన పుస్తకం సింప్లి ఫ్లైను ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాటిక్‌ మార్పులు చేర్పులు చేసి 'శూరరై పోట్రు' సినిమాను తెరకెక్కించారు. 



Updated Date - 2021-07-12T15:52:01+05:30 IST