కాబోయే పెళ్లికూతురు Katrina ని చుట్టుముట్టిన... ఫ్యాన్స్, మీడియా... వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-12-05T22:10:55+05:30 IST

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంకా నోరు మెదపకపోయినా వారిద్దరి పెళ్లి దాదాపు ఖరారైపోయింది. డిసెంబర్ 7 నుంచీ 10 మధ్యలో రాజస్థాన్‌లో రాయల్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ జరుగనున్నాయి. అయితే, అభిమానులకి, మీడియాకి ఎంత మాత్రం అనుమతి లేకున్నా హంగామా తీవ్రంగానే కొనసాగుతోంది.

కాబోయే పెళ్లికూతురు Katrina ని చుట్టుముట్టిన... ఫ్యాన్స్, మీడియా... వీడియో వైరల్!

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంకా నోరు మెదపకపోయినా వారిద్దరి పెళ్లి దాదాపు ఖరారైపోయింది. డిసెంబర్ 7 నుంచీ 10 మధ్యలో రాజస్థాన్‌లో రాయల్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ జరుగనున్నాయి. అయితే, అభిమానులకి, మీడియాకి ఎంత మాత్రం అనుమతి లేకున్నా హంగామా తీవ్రంగానే కొనసాగుతోంది. మీడియాలో, సొషల్ మీడియాలో రకరకాల వార్తలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. లెటెస్ట్‌గా కత్రీనా కైఫ్ వీడియో ఒకటి కాబోయే పెళ్లికూతురి క్రేజ్ ఏంటో అర్థం అయ్యేలా వైరల్ అవుతోంది... 


మరి కొద్ది గంటల్లోనే మిసెస్ విక్కీ కౌశల్ అవ్వనుంది కత్రీనా కైఫ్. అటువంటి సమయంలో ఆమె ముంబైలోని తన ఇంటి నుంచీ కాలు బయటమోపింది. మరింక పాపరాజీ కెమెరామెన్ ఊరుకుంటారా? మధువుపై వాలిన ఈగల్లా నవ వధువు చుట్టూ చేరాయి మీడియా కెమెరాలు! అంతే కాదు, కత్రీనా కైఫ్ ఇంటి ముందు వేచి ఉన్న అభిమానులు కూడా మీడియా వారికి తోడయ్యారు. క్షణాల్లో రచ్చరచ్చ అయిపోయింది!

ఇన్‌స్టా

గ్రామ్‌లో అప్‌లోడ్ అయిన కత్రీనా కైఫ్ లెటెస్ట్ వీడియో ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి ముందు కాబోయే పెళ్లికూతురు కాలు బయటపెట్టిందంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే, ‘‘ఆమెకి కాస్త ముందుకు కదిలే చోటివ్వండి’’ అంటూ కొందరు విచారం వ్యక్తం చేశారు. ‘‘మీరు కనీసం ఆమెకి... కార్ డోర్ కూడా మూసే ఛాన్స్ ఇవ్వటం లేదు’’ అని మరికొందరు పాపరాజీ మీడియాని తప్పుబట్టారు. ఏది ఏమైనా బాలీవుడ్‌లో రైట్ నౌ విక్కీ, కత్రీనా మ్యారేజ్ ఒక్కటే ఫుల్ ట్రండింగ్‌లో కొనసాగుతోంది... 



Updated Date - 2021-12-05T22:10:55+05:30 IST