54వ పుట్టినరోజు వేళ... 37 ఏళ్ల నాటి ‘ఫోటో’ VIRAL !

ABN , First Publish Date - 2021-11-13T22:45:27+05:30 IST

1980లు, 90లలో దేశంలోని కుర్రాళ్లకు నిద్రలు కరువయ్యేలా చేసింది జుహీ చావ్లా. షారుఖ్, ఆమీర్ లాంటి బిగ్ స్టార్స్ ‌తో ఆమె పలు సూపర్ హిట్స్ అందించింది. అయితే, ఆమె బర్త్ డే నవంబర్ 13న. ఇవాళ్ల తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న జుహీపై అటు ఇండస్ట్రీ నుంచీ, ఇటు ఫ్యాన్స్ నుంచీ శుభాకాంక్షల వర్షం కురిసింది. అదే సమయంలో ఆమెకు సంబంధించిన ఒక త్రోబ్యాక్ పిక్ తెగ వైరల్ కూడా అవుతోంది...

54వ పుట్టినరోజు వేళ... 37 ఏళ్ల నాటి ‘ఫోటో’ VIRAL !

1980లు, 90లలో దేశంలోని కుర్రాళ్లకు నిద్రలు కరువయ్యేలా చేసింది జుహీ చావ్లా. షారుఖ్, ఆమీర్ లాంటి బిగ్ స్టార్స్ ‌తో ఆమె పలు సూపర్ హిట్స్ అందించింది. అయితే, ఆమె బర్త్ డే నవంబర్ 13న. ఇవాళ్ల తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న జుహీపై అటు ఇండస్ట్రీ నుంచీ, ఇటు ఫ్యాన్స్ నుంచీ శుభాకాంక్షల వర్షం కురిసింది. అదే సమయంలో ఆమెకు సంబంధించిన ఒక త్రోబ్యాక్ పిక్ తెగ వైరల్ కూడా అవుతోంది... 


జుహీ చావ్లాపై బీ-టౌన్ ద‌‌ృష్టి పడటానికి కారణం 1984లో ఆమె మిస్ ఇండియా కిరీటం గెలవటమే. తరువాత భారత్ తరుఫున మిస్ యూనివర్స్ పోటీలకు కూడా వెళ్లిన జుహీ అంతర్జాతీయ స్థాయిలో విజయం పొందలేకపోయింది. కానీ, మిస్ ఇండియా కిరీటంతో వచ్చిన పాప్యులారితో బాలీవుడ్‌లో అయితే కాలుమోపగలిగింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటూ తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం అడపాదడపా తనకు నచ్చిన క్యారెక్టర్స్ చేస్తోన్న జుహీ చావ్లా శనివారం బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే, ఆమె 1984లో మిస్ ఇండియాగా ఎంపికైనప్పుడు నటి రేఖ తనకి అందాల మకుటం తలపై అలంకరించింది. ఆ చారిత్రక సన్నివేశం ఎవరో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బంధించారు! ఇప్పుడు అదే 37 ఏళ్ల కిందటి చిత్రం అంతర్జాలంలో వైరల్ గా మారింది! సొషల్ మీడియాలో ‘మిస్ ఇండియా’ జుహీని జనం పొగడకుండా ఉండలేకపోతున్నారు! ఫ్యాన్స్ అయితే 18 ఏళ్ల యంగ్ జుహీ మెస్మరైజింగ్ బ్యూటీ చూసి మైమరిచిపోతున్నారు...   

Updated Date - 2021-11-13T22:45:27+05:30 IST