సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌లో '96' రీమేక్!

ABN, First Publish Date - 2021-09-23T13:38:21+05:30

తమిళంలో సూపర్ హిట్ అయిన '96' చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దాదాపు తన కెరీర్ అయిపోయిందనుకున్న సమయంలో '96' మూవీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళంలో సూపర్ హిట్ అయిన '96' చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దాదాపు తన కెరీర్ అయిపోయిందనుకున్న సమయంలో '96' మూవీలో నటించి సాలీడ్ హిట్‌ అందుకొని కంబ్యాక్ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ త్రిష. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. తమిళంలో మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో ‘జాను’గా రీమేక్ చేయగా, సమంత - శర్వానంద్  నటించారు. దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాగా '96 మూవీని ఇప్పుడు హిందీలో అజయ్ కపూర్ నిర్మించబోతున్నారు. అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే చిత్ర దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-23T13:38:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!