అనుష్క ‘నిశ్శబ్దం’ ఇంటర్వ్యూ : నేనే కారణం అంటే ఒప్పుకోను
ABN , First Publish Date - 2020-09-29T23:32:16+05:30 IST
`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకాబోతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా స్వీటీ అనుష్క మంగళవారం జూమ్ వీడియో ద్వారా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ..
* నేను కావాలని సినిమా సినిమా మధ్య బ్రేక్ తీసుకోవడం లేదు. భాగమతి తర్వాత మాత్రం కావాలనే బ్రేక్ తీసుకున్నాను. ఆ టైమ్ లోనే నిశ్శబ్దం స్ర్కిప్ట్ కోన వెంకట్ చెప్పారు. స్ర్కిప్ట్ వినగానే చాలా కొత్తగా అనిపించింది. కథ నాకు ఎంతగానో నచ్చింది.‘నిశ్శబ్దం’మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నా పాత్రపేరు సాక్షి. ఇందులో నాకు వినబడదు, కనబడదు. చాలెంజింగ్‌గా తీసుకుని మరీ ఈ పాత్ర చేశాను.
* ఈ సినిమా కోసం అమెరికా సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అమెరికాలో రెండు నెలలు ట్రైనింగ్ తీసుకుని ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని.
* ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. నా పాత్రే ఒక్కటే లీడ్ కాదు. మాధవన్, షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నా ఒక్కదాని మీదే ప్రెజర్ ఉందని చెప్పను. ఒక సినిమా 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తేనే రూపుదిద్దుకుంటుంది. ఒక్కరు కాదు అందరి సపోర్ట్ అవసరం. అందరూ కలిసి పనిచేస్తేనే విజయం వస్తుంది. నా ఒక్కదానిపైనే ఒత్తిడి ఉంటుందనేది కానీ, విజయానికి నేనే కారణం అనే మాటలను నేను ఒప్పుకోను.

* సినిమాకి కథతోపాటు డైరెక్టర్ కూడా చాలా కీలకం. హేమంత్ మధుకర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇలాంటి పాత్ర చేసినందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఫీలయ్యాను. నేను చేసిన అన్ని సినిమాల కంటే ఈ చిత్రంలో చేసిన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
* యుఎస్‌లో అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. నేను నటించిన సినిమా మొత్తం యుఎస్‌లో షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా ఎంజాయ్ చేశాం. చాలా త్వరగా చిత్రీకరణ జరిగింది. అమెరికా క్రూ కూడా ఉన్నారు. మంచి అనుభవం. మనవాళ్లతో, అమెరికా క్రూతో కలిసి నటించడం సంతోషంగా అనిపించింది.
* రిలీజ్ వాయిదా పడడానికి కారణం ఉంది. అన్ని లాంగ్వేజేస్‌లో ఒకేసారి రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.
* గోపిసుందర్ మ్యూజిక్, గిరీష్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది. డిఫరెంట్ స్ర్కిన్ ప్లే ని విజువలైజ్ చేసుకుని మ్యూజిక్ అందించారు. విజువల్స్‌తో పాటు సౌండ్ కూడా సినిమాకి చాలా ఇంపార్టెంట్. అది థియేటర్లో అయితే అందరూ ఎంతో ఎంజాయ్ చేసేవారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు.
* కోవిడ్ 19 కారణంగా సినిమా ఇండస్ట్రీయే కాదు. ప్రపంచమంతా ఇబ్బంది పడింది. ఇలాంటి సమయంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్. నా వరకు మాత్రం థియేటర్స్‌లో సినిమా చూడడమే ఇష్టపడతాను. ఓటీటీ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో పాన్ ఇండియా మూవీస్ కూడా ఓటీటీలో వచ్చేస్తాయి. భవిష్యత్తులో ఓటీటీ యూజ్ మరింతగా పెరుగుతుంది. బాహుబలి అన్ని దేశాల్లో ఎలా రిలీజ్ అయ్యిందో.. ఇప్పుడు ఓటీటీల ద్వారా కూడా ప్రతి సినిమా అన్ని దేశాలకు చేరుతుంది.
* ఈ చిత్ర షూటింగ్లో కొన్ని అంశాలు నన్ను థ్రిల్ చేశాయి. మాధవన్‌తో పాత రోజులు గుర్తుచేసుకున్నాం. 13 సంవత్సరాల తర్వాత మాధవన్‌తో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. హాలీవుడ్ నటుడు మైకేల్ దగ్గర కొన్ని కొత్త విషయాలను నేర్చుకున్నాను.
* లాక్డౌన్లో నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎన్నో సినిమాలు చూశాను. కథలెన్నో చదివాను. రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశాను. త్వరలోనే వాటి గురించి తెలియజేస్తాను.

* సూపర్ నుంచి నిశ్శబ్దం వరకు చూసుకుంటే.. గొప్పవారెందరితోనో వర్క్ చేశాను. అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. అరుంధతి చిత్రం నా లైఫ్‌ని టర్న్ చేసింది. నా దర్శకులు, నిర్మాతలు నన్ను నమ్మి మంచి మంచి పాత్రలతో ప్రోత్సహించారు. ఇక అభిమానులు లేకుండా నా ఈ జర్నీ పూర్తవదు.
* ‘నిశ్శబ్దం’ కొత్త కాన్సెప్ట్ కనుక ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం. అందరికీ సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ అనిపిస్తుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను.
