విద్యుల్లేఖ రామన్ వెయిట్ లాస్ సీక్రెట్స్
ABN , First Publish Date - 2020-09-14T03:53:38+05:30 IST
పుట్టి పెరిగింది చెన్నైలో అయినా తెలుగువారి అభిమాన హాస్యనటిగా మారింది విద్యుల్లేఖ రామన్. బెస్ట్ కమెడియన్‌గా ఫీమేల్ కేటగిరీలో ఆమె

పుట్టి పెరిగింది చెన్నైలో అయినా తెలుగువారి అభిమాన హాస్యనటిగా మారింది విద్యుల్లేఖ రామన్. బెస్ట్ కమెడియన్‌గా ఫీమేల్ కేటగిరీలో ఆమె నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇటీవల పేరుకు తగినట్లుగా లతలా మారి.. త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోంది. తాజాగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. కెరియర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి.. ఇలా ఎన్నో విషయాలను విద్యుల్లేక రామన్ ఈ చిట్‌చాట్‌లో తెలియజేశారు.
మీలో ఇంత ఛేంజ్‌కు కారణం?
విద్యుల్లేఖః సంవత్సరంన్నర నుంచి వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను. సడెన్‌గా చేసింది అయితే కాదు. క్విక్ ఎక్సర్సైజ్లు చేయలేదు. షాట్ కట్స్ చేయలేదు. చాలా నెమ్మదిగా వన్ అండ్ హాప్ సంవత్సరం నుంచి వెయిట్ లాస్ స్టార్ చేశాను. మహేష్ బాబుగారి 'మహర్షి' సినిమా చేసేటప్పుడు నా వెయిట్ 86 ఉంది. అంతకు ముందు ఎక్కువ ఉండవచ్చు ఏమో గానీ.. నేను ఎప్పుడూ చూసుకోలేదు. నేను లాస్ట్‌గా చూసుకున్న వెయిట్ 86 కేజీలు. మహర్షి సినిమా అప్పుడు చూసుకున్నా. ఆ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వేకప్ కాల్. అమ్మానాన్న నాకొక డ్రస్ కొనిచ్చారు. ఆ డ్రస్ 20 రోజుల తర్వాత అస్సలు నాకు సరిపోలేదు. అప్పుడు నాకు షేమ్‌ఫుల్ ఫీలింగ్ వచ్చింది. నా వెయిట్ అంత పెరిగిందా.. అసలు కంట్రోలే లేదా? అనే డిప్రెషన్ ఫీలింగ్ ఏర్పడింది. అప్పుడు నా మనసులో అనుకున్నాను.. విద్యూ.. ఈ రోజు నుంచి హెల్త్ గురించి, వెయిట్ గురించి ఫోకస్ చేయాలని. చాలా డెడికేటెడ్‌గా చేయాలని. సో.. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఫిబ్రవరి 2019లో స్టార్ట్ చేస్తే.. ఈరోజు నేను 20 కిలోస్ తగ్గాను.
బొద్దుగా ఉన్నా.. మీరు బాగానే ఉన్నారుగా?
బొద్దుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాను కానీ.. హెల్త్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేశాను. అలాగే షూటింగ్లో కూడా కంఫర్ట్‌గా లేను. అది నా మేనేజర్‌కి కూడా తెలుసు. చాలా బద్దకంగా ఉండేదానిని. అస్తమాను పడుకోవమే చేసేదానిని. ఫేస్ కూడా ఇబ్బందిగా తయారై.. స్క్రీన్‌పై కూడా బాగుండేది కాదు. నా వర్క్ అవుట్ పుట్ మీద కూడా నేను హ్యపీగా ఉండేదానిని కాను. ఇలా మారిన తర్వాత బాగుంటుందని అనుకున్నాను.. ఇప్పుడదే జరుగుతుంది.
ఎంగేజ్మెంట్ కామ్‌గా చేసుకున్నారు.. పెళ్లికైనా అందర్నీ పిలుస్తారా?
ఖచ్చితంగా.. అందరికీ లైవ్‌లో చూపిస్తాను. ఎందుకంటే కరోనా కారణంగా అందర్నీ పిలవడానికి అవకాశం లేదు. అందుకే అందరికీ లైవ్ స్ట్రీమే.
కరోనా టైమ్‌లో ఏం చేయాలన్నా ఆలోచిస్తుంటే.. మీరు సడెన్‌గా ఎంగేజ్మెంట్.. కారణం?
ఇది నాకు కాబోయే భర్త సంజయ్‌తో ఒక సంవత్సరంగా ట్రావెల్ అవుతున్నాను. అప్పుడే మేము అనుకున్నాం. 2020లో ఎంగేజ్మెంట్, 2021లో మ్యారేజ్ అని ప్లాన్ చేసుకున్నాం. ఈ కరోనా టైమ్‌లో రేపు ఏం జరగబోతుందో అనేది ఎవరికీ క్లారిటీ లేదు కదా. 2020 మొత్తం కరోనాకే పోయింది. కనీసం ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. మా ఫ్యామిలీకి, మాకు సంతోషంగా ఉంటుందని.. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం.
మీది లవ్ మ్యారేజ్.. అంతేగా..?
అవును.. ఫస్ట్ సంజయే ప్రపోజ్ చేశారు. విషయం ఏమిటంటే.. నేను ఏం చేస్తాననేది ఆయనకి తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఏ పాత్రలు చేస్తానో కూడా తెలియదు. నార్త్ ఇండియన్ అబ్బాయ్ కదా.. నా సినిమాలు ఆయన చూడలేదు. మేం ఫస్ట్ మీట్ అయినప్పుడు నా గురించి ఆయనకేమీ తెలియదు. నాకు అదే నచ్చింది. చాలా మంది మీరు నటి, ఫేమస్ అంటూ ఏవేవో చెబుతారు. కానీ సంజయ్ ఆ టైప్ చేయలేదు.
ఫిట్నెస్ ట్రైనరా?
కాదు. ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కాదు. ఆయనకి ఐస్‌క్రీమ్ తయారుచేసే యూనిట్ ఉంది. సుగర్ ఫ్రీ, లో కేలరీ ఐస్‌క్రీమ్ చేస్తుంటారు. అతని టెక్స్టైల్ బిజినెస్ ఫ్యామిలీ.
వెయిట్ లాస్ విషయంలో ఆయన హెల్ప్ ఉందా?
ఖచ్చితంగా ఉంది. సంజయ్‌ని కలవక ముందే నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కూడా కొన్ని టిప్స్ చెప్పడంతో, అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.
మీకు ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పారు.. మరి డైట్ కంట్రోల్ ఎలా?
ఇష్టమే. మానేయడం కష్టమే కానీ.. కొన్నిసార్లు త్యాగాలు తప్పవు కదా. రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. గోల్ రీచ్ అయ్యే వరకు తప్పదు మరి. వెయిట్ లాస్ జర్నీలో కొంచెం సెల్ప్ కంట్రోల్ చేయాలి. కాంప్రమైజెస్ చేయాలి. ఈ సంవత్సరంన్నరలో నేను నేర్చుకుంది ఇదే.
వెయిట్ లాస్ తర్వాత కూడా డైట్ కంట్రోల్ చేయాలి కదా?
అవును చేయాలి. దానిని మెయింటినెన్స్ డైట్ అంటారు. వెయిట్ లాస్, మెయింటినెన్స్ డైట్ వేరువేరుగా ఉంటుంది.
ఇంకా వెయిట్ లాస్ విషయాలతో పాటు.. తన చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలను కూడా విద్యుల్లేఖ రామన్ తెలియజేశారు. అవన్నీ తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.