దాడి తర్వాత తొలిసారి రెస్పాండ్‌ అయిన సంయుక్తా హెగ్డే

ABN , First Publish Date - 2020-09-08T23:42:43+05:30 IST

టాలీవుడ్‌లో కింగ్‌ నాగార్జున‌తో మ‌న్మథుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్తా హెగ్డే. ఇటీవల

దాడి తర్వాత తొలిసారి రెస్పాండ్‌ అయిన సంయుక్తా హెగ్డే

టాలీవుడ్‌లో కింగ్‌ నాగార్జున‌తో మ‌న్మథుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్తా హెగ్డే. ఇటీవల ఆమె బెంగ‌ళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి కొంత మంది స్నేహితులతో క‌లిసివెళ్లగా.. ఆ స‌మయంలో అక్క‌డున్న‌ క‌వితా రెడ్డి అనే మ‌హిళ సంయుక్తా‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. స‌దరు దాడి చేసిన మ‌హిళకు అక్క‌డే ఉన్న కొంత మంది ప‌బ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ ఆర్టిస్టులంద‌రూ డ్ర‌గ్స్ వాడుతారంటూ సంయుక్తా హెగ్డేపై దాడి చేసి, ఆమెను పబ్లిక్‌గా అవమానించారు. ఈ ఘ‌ట‌నతో షాక్‌కు గురైన సంయుక్తా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత తొలిసారి ఆమె ఈ ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.


* హాయ్‌.. 

* నేను తెలుగు అర్థం చేసుకోగలను కానీ.. తెలుగులో మాట్లాడలేను.

* నా పర్సనల్ వర్క్‌ చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్లాను. నా డ్రస్ వల్ల వారికి ఏం ఇబ్బందో నాకు తెలియడం లేదు. ఆ ఘటన జరిగిన వీడియో నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. అందరూ చూడండి. ఆ ఘటనలో ఏం తప్పు ఉందో నాకిప్పటికీ అర్థం కాలేదు. 

* నేను రెగ్యులర్‌గా పార్క్‌లకు వెళుతూనే ఉంటాను. చివరి రెండు వారాల్లో ఆ పార్క్ కు నేను నాలుగు సార్లు వెళ్లడం జరిగింది. నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఆ పార్క్ కి దగ్గరలో నివసిస్తున్నారు. నా ఫ్రెండ్‌తో కలిసి వెళుతుంటాను.  

* మాపై దాడి చేసిన ఆమె ఎవరో.. ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందో నాకు తెలియదు. నా స్నేహితులకు కూడా తెలియదు. పెద్దపెద్దగా అరుస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూడండి. రెడ్‌ కలర్‌ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి నన్ను బాగా అవమానించాడు. అతని పేరు అనిల్‌ రెడ్డి అనుకుంటాను. అతనే బూతులు తిడుతూ.. మీదమీదకు వచ్చాడు. చాలా మంది జనం మా చుట్టూ చేరారు. చాలా భయం వేసింది.

* శాండిల్‌వుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్‌ అంటూ హడావుడి జరుగుతుంది. కొందరిని అరెస్ట్ కూడా చేశారని తెలిసింది. పెద్ద డ్రగ్స్‌ స్కాండిల్‌ నడుస్తుందని అంటున్నారు. ఆ విషయమే టార్గెట్‌ చేస్తూ.. నాపై దాడి చేశారు. నేను చెప్పేది ఒక సైడే ఉన్నట్లు ఉంటుంది. అందరూ వీడియో చూస్తే అర్థమవుతుంది. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. ఎలా ఈ ఘటన నుంచి బయటికి రావాలో అర్థం కావడం లేదు. ఆ ఘటనతో చాలా భయపడ్డాను.. అని సంయుక్తా హెగ్డే తెలిపింది.Updated Date - 2020-09-08T23:42:43+05:30 IST