విజయ నిర్మల విషయంలో రాజబాబు జోక్.. ఆ తర్వాత నిజమైపోయింది!

ABN , First Publish Date - 2020-02-02T03:13:48+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంట.. టాలీవుడ్‌లో మరపురాని జోడీగా అనేక అద్భతాలు సృష్టించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీరి జోడీ

విజయ నిర్మల విషయంలో రాజబాబు జోక్.. ఆ తర్వాత నిజమైపోయింది!

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంట.. టాలీవుడ్‌లో మరపురాని జోడీగా అనేక అద్భతాలు సృష్టించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీరి జోడీ అందించింది. ‘సాక్షి’ సినిమాతో మొదలైన వీరి సినీ ప్రయాణం.. దంపతులుగా మారే వరకు వెళ్లింది. 1967లో వచ్చిన ‘సాక్షి’ సినిమా షూటింగ్ గోదావరి తీరంలోని పులిదిండి గ్రామంలో జరిగింది. లెజండరీ దర్శకుడు బాపు.. గ్రామంలోని మీసాల కృష్ణుడి గుడిలో వీరిద్దరిపై ఓ సీన్ ప్లాన్ చేశారు. ఆరుద్ర రాసిన ‘‘అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా.. బతకరా బతకరా పచ్చగా.. నీకు నేనుంటా వెయ్యేళ్లు తోడుగా, నీడగా..’’ అనే పాటను కృష్ణ, విజయ నిర్మలపై షూట్ చేశారు. ఇద్దరూ నూతన దంపతుల గెటప్‌లో ఆ సీన్‌లో కనిపిస్తారు. ఇదంతా గమనిస్తున్న అప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు ఓ జోక్ చేశారట. ఈ గుడి చాలా మహిమ కలదని.. ఇక్కడ జరిగే ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతాయని... మరి వీరి విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలంటూ ఫన్నీ కామెంట్ చేశారట. అయితే యాదృచ్ఛికంగా ఆ తర్వాత రెండేళ్లకే వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.


మరో విశేషం ఏంటంటే.. వీరిద్దరూ మూడు సార్లు పెళ్లి చేసుకున్నారని చెబుతుంటారు. సాక్షి సినిమా షూటింగ్‌లో భాగంగా ఒకసారి చేసుకోగా, మేకప్ మెన్ మాధవ్ అర్చకత్వంలో ఊటీలో రెండోసారి, ఇక తిరుపతిలో అధికారికంగా మూడోసారి వివాహం చేసుకుంది ఈ జంట.

Updated Date - 2020-02-02T03:13:48+05:30 IST