టీవీ ఇండస్ట్రీలో నన్ను బ్యాన్ చేశారు.. యాక్టర్ షాకింగ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-07-16T02:36:04+05:30 IST

తనను టీవీ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారని, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చానని బాలీవుడ్ నటుడు అమిత్ సాధ్ షాకింగ్ విషయం వెల్లడించాడు.

టీవీ ఇండస్ట్రీలో నన్ను బ్యాన్ చేశారు.. యాక్టర్ షాకింగ్ కామెంట్స్!

ముంబై: తనను టీవీ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారని, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చానని బాలీవుడ్ నటుడు అమిత్ సాధ్ షాకింగ్ విషయం వెల్లడించాడు.  ‘క్యూ హోతా హై ప్యార్’ అనే  టీవీ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన అమిత్.. ఈ సీరియల్‌తో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తనకు టీవీ ఇండస్ట్రీలో నిషేధించారని, పోన్‌లు చేసుకొని మరీ తనకు పని ఇవ్వొద్దని చెప్పుకునేవారని అమిత్ చెప్పాడు. కొన్ని నిజాలు బయటపెట్టినందుకే ఇండస్ట్రీ వాళ్లు తనను అలా వెలివేసినట్లు అతను తెలిపాడు. దీంతో టీవీ ఇండస్ట్రీలో తనకు పని లేకపోతే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్నట్లు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ హీరోతో కూడా అమిత్ కలిసి నటించాడు. వీరిద్దరూ కలిసి నటించిన ‘కై పో చే’ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్‌గా నిలిచింది.

Updated Date - 2020-07-16T02:36:04+05:30 IST