చనిపోవడానికి ముందు.. శునకాల పోషణ గురించి ఆలోచించిన సుశాంత్!

ABN , First Publish Date - 2020-09-07T01:20:39+05:30 IST

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవడానికి ముందు కూడా తన

చనిపోవడానికి ముందు.. శునకాల పోషణ గురించి ఆలోచించిన సుశాంత్!

ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవడానికి ముందు కూడా తన పెంపుడు శునకాల గురించే ఆలోచించాడు. తనువు చాలించడానికి ముందు రోజు శునకాల పోషణకు సంబంధించిన డబ్బును వాటి సంరక్షకుడికి బదిలీ చేశాడు.


సుశాంత్‌కు తన పెంపుడు శునకాలంటే ఎంతో ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా లోనావాలాలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న పెంపుడు శునకాలు అమర్, అక్బర్, ఆంటోనీలతో ఆడుకునేవాడు. తాను చనిపోవాలని నిర్ణయించుకున్న ముందు రోజు ఆ శునకాల బాగోగులు చూస్తున్న వాటి సంరక్షకుడు రాయీస్‌కు నగదు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని రాయీస్ స్వయంగా వెల్లడించాడు.


రాయీస్ మాట్లాడుతూ.. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు టీవీలో చూశానని, అంతకుముందు రోజే తన పెంపుడు కుక్కలకు అవసరమయ్యే డబ్బును తన ఖాతాలో వేశాడని గుర్తు చేసుకున్నాడు. సుశాంత్ తరచూ ఫామ్‌హౌస్‌కి వచ్చేవాడని, రియా, ఆమె తండ్రి పుట్టిన రోజు వంటి వాటిని ఫామ్‌హౌస్‌లోనే జరుపుకునేవారని పేర్కొన్నాడు. జనవరిలో సుశాంత్ పుట్టిన రోజున రియాతో కలిసి ఫాం హౌస్‌కు వచ్చాడని, అతడి వెంట అతడి మేనేజర్ శామ్యాల్ మిరాండా, శ్రుతి మోదీతోపాటు పలువురు స్నేహితులు కూడా వచ్చారని పేర్కొన్నాడు. 


అయితే, గతేడాది అక్టోబరులో ఐరోపా పర్యటన అనంతరం సుశాంత్ అనారోగ్యానికి గురయ్యాడని, దీంతో రెండు నెలలపాటు ఫామ్‌హౌస్‌కు దూరంగా ఉన్నాడని రాయీస్ పేర్కొన్నాడు. నిజానికి ఫామ్‌హౌస్‌ను సుశాంత్ అద్దెకు తీసుకున్నాడని, ఏడాది తర్వాత దానిని కొనేసి శాశ్వతంగా అక్కడికి వచ్చేసి సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించాడని వివరించాడు. ఫిబ్రవరిలో చివరిసారి ఫామ్‌హౌస్‌కు వచ్చాడని, ఆ తర్వాత రెండుమూడు నెలలు అక్కడే ఉండాలని ప్లాన్ చేశాడని రాయీస్ వివరించాడు.

Updated Date - 2020-09-07T01:20:39+05:30 IST