నేను కూడా ప్లాస్మా డొనేట్ చేశా.. సింగర్ కనికా కపూర్

ABN , First Publish Date - 2020-04-28T03:17:27+05:30 IST

కరోనా నుంచి ఈ మధ్యనే కోలుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. తాను కూడా ప్లాస్మా డొనేట్ చేశానంటూ..

నేను కూడా ప్లాస్మా డొనేట్ చేశా.. సింగర్ కనికా కపూర్

లక్నో: కరోనా నుంచి ఈ మధ్యనే కోలుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. తాను కూడా ప్లాస్మా డొనేట్ చేశానంటూ ప్రకటించింది. దీనికోసం ఈరోజు ఉదయం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పటల్‌కు ఫోన్ చేశానని, కరోనా బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తన రక్తాన్ని డొనేట్ చేశానని కనికా తెలిపారు. ఆమె ద్వారా సేకరించిన రక్తం ద్వారా ప్లాస్మాను సేకరించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే గత నెల బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన కనికా కపూర్ హౌస్ క్వారంటైన్‌లో లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే తొలి ఐదు పరీక్షల్లో కనికకు కరోనా పాజిటివ్‌ రాగా ఆరో పరీక్షలో మాత్రం నెగెటివ్ వచ్చింది. దాంతో ఆమెను వైద్యులు ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు.

Updated Date - 2020-04-28T03:17:27+05:30 IST