అడ్డంకులను దాటి విజయం సాధించాలి

ABN , First Publish Date - 2020-02-27T16:05:45+05:30 IST

వన్‌ డే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై యువ దర్శకుడు రాజా మురళీధరన్‌ తెరకెక్కిస్తున్న ‘నరువి’ ఆడియో బుధవారం ఉదయం చెన్నైలో విడుదల చేశారు. ప్రసాద్‌ల్యాబ్‌ ప్రివ్యూ

అడ్డంకులను దాటి విజయం సాధించాలి

  • ‘నరువి’ ఆడియో వేడుకలో పా.రంజిత్‌

వన్‌ డే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై యువ దర్శకుడు రాజా మురళీధరన్‌ తెరకెక్కిస్తున్న ‘నరువి’ ఆడియో బుధవారం ఉదయం చెన్నైలో విడుదల చేశారు. ప్రసాద్‌ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పా.రంజిత్‌ ముఖ్య అతిథిగా హాజరై పాటలను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా పా.రంజిత్‌ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్ర దర్శకుడిలాగే నేను కూడా ‘అట్టకత్తి’ సమయంలో టెన్షన్‌కి గురయ్యాను. ‘నరువి’ పెద్ద విజయం సాధించి, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుతం సినిమాలు తీయడం కంటే వాటిని విడుదల చేయడమే కష్టంగా ఉంది. ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమాలోని విజువల్స్‌ బాగున్నాయి.   ‘నరువి’ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి క్రిస్టీ సంగీతం సమకూర్చగా, వర్ధమాన నటుడు సెల్వ హీరోగా పరియమవుతున్నాడు.

Updated Date - 2020-02-27T16:05:45+05:30 IST