చూడండి.. మా నాన్నను మీడియా ఎలా చుట్టుముట్టిందో: వీడియో షేర్ చేసిన రియా

ABN , First Publish Date - 2020-08-27T22:06:00+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ

చూడండి.. మా నాన్నను మీడియా ఎలా చుట్టుముట్టిందో: వీడియో షేర్ చేసిన రియా

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి బయట కారు దిగిన రియా తండ్రిని మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన రియా.. తన తండ్రిని వారెలా చుట్టుముట్టారో చూడాలని పేర్కొంది. ఇంటి నుంచి బయటకు వచ్చి దర్యాప్తునకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్న రియా.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసుల సాయం కోరినా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని రియా పేర్కొంది.  

Updated Date - 2020-08-27T22:06:00+05:30 IST