పెళ్లి ఉబలాటంలో రిటైర్డ్ అధికారి... ఊహించని షాకిచ్చిన మహిళ!

ABN , First Publish Date - 2020-02-16T12:38:42+05:30 IST

పెళ్లి కోసం తాపత్రయ పడిన 77 ఏళ్ల రిటైర్డ్ అధికారి ఊహించని విధంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని సర్ఖండాలో ఉంటున్న రిటైర్డ్ అధికారికి...

పెళ్లి ఉబలాటంలో రిటైర్డ్ అధికారి... ఊహించని షాకిచ్చిన మహిళ!

బిలాస్‌పూర్: పెళ్లి కోసం తాపత్రయ పడిన 77 ఏళ్ల రిటైర్డ్ అధికారి ఊహించని విధంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని సర్ఖండాలో ఉంటున్న రిటైర్డ్ అధికారికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. భార్య మరణించాక ఒంటరిగా ఉంటున్న ఆ అధికారి మరో పెళ్లి చేసుకునేందుకు ఒక ప్రకటన ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఆశాశర్మ అనే మహిళ అతనిని సంప్రదించింది. తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా ఆశాదేవి కోసం ఇద్దరు యువకులు వారింటికి తరచూ వస్తుండేవారు. ఆమె వారిద్దరూ తన బంధువులని రిటైర్డ్ అధికారికి చెప్పేది. అలాగే ఆమె పలు కారణాలు చెబుతూ ఆ రిటైర్డ్ అధికారి నుంచి రూ. 40 లక్షల మొత్తాన్ని దఫాదఫాలుగా తీసుకుంది. అయితే ఆ మహిళ ఉన్నట్టుండి ఆ రిటైర్డ్ అధికారికి చెందిన కారుతో సహా పరారయ్యింది. దీంతో ఆ మహిళపై ఆ రిటైర్డ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-02-16T12:38:42+05:30 IST