‘మర్డర్’ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-12-24T00:40:55+05:30 IST

‘మర్డర్’ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

‘మర్డర్’ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: ‘మర్డర్’ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణయ్ సతీమణి అమృత హైకోర్టులో కంట్మెంట్ పిటిషన్‌ దాఖలు చేసింది. మంగళవారం దర్శకుడు రాంగోపాల్, మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు. తన కథనే ఆధారంగానే సినిమాను రూపొందించారని అమృత పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కథనే చిత్రంగా తీసి... కోర్టును తప్పుదోవపట్టించారంటున్నారని ఆమె చెప్పారు. లంచ్‌ పిటిషన్‌ను విచారించాలని న్యాయస్థానాన్ని అమృత కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. బుధవారం సినిమా విడుదలకు చిత్ర యూనిట్‌ సిద్ధమైంది.


రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మర్డర్’ మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా వివాదాస్పదమైంది. 

Updated Date - 2020-12-24T00:40:55+05:30 IST