గర్భం దాల్చిన కుక్కకు సీమంతం.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2020-10-28T23:22:57+05:30 IST

అచ్చం మనుషులకు చేసినట్టే సీమాంతం చేశారు. ఆడ, మగ కుక్కలకు కొత్త డ్రస్సులు, పూల దండలు వేసి డబ్బు వాయిద్యాలతో..

గర్భం దాల్చిన కుక్కకు సీమంతం.. ఫొటోలు వైరల్

జయశంకర్ భూపాలపల్లి: టేకుమట్ల మండలం పెద్దంపల్లిలో గర్భం దాల్చిన కుక్కకు సీమాంతం నిర్వహించారు. పెంచుకున్న కుక్కకు యజమాని అచ్చం మనుషులకు చేసినట్టే సీమాంతం చేశారు. ఆడ, మగ కుక్కలకు కొత్త డ్రస్సులు, పూల దండలు వేసి డబ్బు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. రెండు కుక్కలను ఒక దగ్గరే ఉంచి చదివింపులు కూడా చదివించారు. వాటితో ఫొటోలు దిగి సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


Updated Date - 2020-10-28T23:22:57+05:30 IST