ఒక భారతీయ తెలుగు కళాకారుని‌ ఇంగ్లిష్ పాట!

ABN , First Publish Date - 2020-04-16T21:05:05+05:30 IST

తెలుగు వారు పి.బి.‌శ్రీనివాస్ 1969లో ఆమ్ స్ట్రాంగ్, ఆల్విన్ లు చంద్రుడిపై కాలుమోపిన సందర్భంలో "మనిషి చంద్రుడిపై‌ కాలు మోపాడు..." అంటూ

ఒక భారతీయ తెలుగు కళాకారుని‌ ఇంగ్లిష్  పాట!

"Man has set his foot on moon".

తెలుగు వారు పి.బి.‌శ్రీనివాస్ 1969లో ఆమ్ స్ట్రాంగ్, ఆల్విన్ లు చంద్రుడిపై కాలుమోపిన సందర్భంలో "మనిషి చంద్రుడిపై‌ కాలు మోపాడు..." అంటూ ఒక ఇంగ్లిష్ పాటను వ్రాసి, సంగీతం చేసి పాడారు. అది EP రికార్డ్‌గా విడుదలయింది. 

అప్పటి‌ అమెరికా అధ్యక్షులు నిక్స్న్ , వ్యోమగామి ఆమ్ స్త్రాంగ్ లు ఈ పాటకు గానూ  పి.బి.‌శ్రీనివాస్ ను ప్రశంసిస్తూ పత్రాలు పంపారు. 

2006లో‌ అమెరికాలో కొన్ని చోట్ల ఈ పాటను విన్న అమెరికన్స్ పి.బి. శ్రీనివాస్ ను ప్రముఖ అమెరికన్ ఇంగ్లిష్ గాయకులు  Jim Reeves తో పోల్చారు. ఇంగ్లిష్‌ పురుష గాయకుల్లో ప్రత్యేకంగా తెలియవచ్చే rounded even warm baritone with verve and clear voice resonance (ring) ఇక్కడ మనకు పి. బి. శ్రీనివాస్ లో తెలియవస్తుంది. పి.బి. శ్రీనివాస్ ది ఒక అంతర్జాతీయ‌ గాత్రం. మన కవిసామ్రాట్ విశ్వనాథ‌ సత్యనారాయణ‌ "పురుషగాత్రం అంటే ఇదే" ‌అని పి.బి. శ్రీనివాస్ ను ప్రస్తుతించారు.

మఱో తెలుగు గాయని ఎస్. జానకి‌ కూడా పి.బి. శ్రీనివాస్‌తో కలిసి పాడారు ఇక్కడ.

తెలుగు నుంచే కాదు, బహుశా మన దేశంలోని‌ ఏ భాష నుంచీ ఇలాంటి ప్రయత్నం జరగి ఉండకపోవచ్చు.

ఒక‌ తెలుగు కవి-గాయకుని అంతర్జాతీయ స్వర,‌ గాన,‌ రచనల ప్రయోగం. 


పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రోచిష్మాన్
9444012279
rochsihmon@gmail.com

Updated Date - 2020-04-16T21:05:05+05:30 IST