ఆయన నాపై తుమ్మి, కొట్టబోయాడు: బాలీవుడ్ కమెడియన్

ABN , First Publish Date - 2020-05-26T03:37:39+05:30 IST

ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పటికీ ఒక్కోసారి అనుకోకుండా కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. దాంతో మనం..

ఆయన నాపై తుమ్మి, కొట్టబోయాడు: బాలీవుడ్ కమెడియన్

ముంబై: ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పటికీ ఒక్కోసారి అనుకోకుండా కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. దాంతో మనం ఖంగుతింటాం. బాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ విషయంలో కూడా ఇప్పడు అలాంటిదే ఓ అనుకోని సంఘటన జరిగింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీర్ అద్దెకుంటున్నాడు. రాత్రి భోజనం చేసేందుకు అదే బిల్డింగ్‌లో నివశించే తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించాడు. అయితే అప్పుడే ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. దానిని వీడియో తీసిన వీర్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసి ఇలా రాసుకొచ్చాడు. ‘భోజనం తయారవ్వడానికి కొంత సమయం ఉండడంతో నా స్నేహితుడు సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లాడు. అప్పటివరకు అతడు మాస్క్ వేసుకునే ఉన్నాడు. నేను ఇంటి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో మా పక్కింటి ఆయన ఆవేశంతో నా వద్దకు వచ్చాడు. నేను తక్షణం లోపలకి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఎందుకని అడిగినందుకు మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతావేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను నా ఇంట్లోనే ఉన్నాను కదా సార్ అని చెప్పాను. దాంతో కోపంగా తన మాస్క్ తీసి నాపై తుమ్మాడు. నన్ను కొడతానంటూ బెదిరించాడు. తానే ఇంటి ఓనర్‌నని, తన తల్లిదండ్రులు మేమున్న ఇంట్లోనే చనిపోయారని, వారు మమ్మల్ని పట్టి పీడిస్తారని శాపాలు పెట్టాడు.


నిజానికి అతడు ఈ  ఇంటి ఓనర్ కాదు. అయితే నాకు ఇలాంటి గొడవలంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే నెమ్మదిగా సమాధానం చెప్పాను. కానీ ఆయన మాత్రం నన్ను దూషించడం ఆపలేదు. నన్ను ఓ పనికిమాలిన క్లౌన్ అంటూ ఎగతాళి చేశాడు. అయితే నా వృత్తిలో అదో పెద్ద ప్రశంశ అని, దానికి థాంక్స్, అని నేను ఆయనకు చెప్పాను. కానీ ఈ తతంగమంతా నన్ను షాక్‌కు గురిచేసింద’ని వీర్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-26T03:37:39+05:30 IST