డిస్నీ+హాట్‌స్టార్‌లో అక్షయ్ కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్’?

ABN , First Publish Date - 2020-04-25T22:26:41+05:30 IST

రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌లో ‘లక్ష్మీ బాంబ్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్

డిస్నీ+హాట్‌స్టార్‌లో అక్షయ్ కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్’?

న్యూఢిల్లీ: రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌లో ‘లక్ష్మీ బాంబ్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అడ్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 


అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో.. సినిమా షూటింగ్‌లకే కాదు.. థియేటర్లు కూడా మూసి ఉండటంతో.. సినిమాల విడుదలు కూడా నిలిచిపోయాయి. దీంతో పలు సినిమాలను నేరుగా.. ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లపై విడుదల చేస్తున్నారు. కొందరు నిర్మాలు ఇందుకు అంగీకరిస్తుండగా.. కొందరు మాత్రం ఒప్పుకోవడం లేదు. 


అయితే ఇప్పుడు ‘లక్ష్మీ బాంబ్’ని కూడా నేరుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల చేయాలని నిర్మాలను కోరారట. ఇప్పటికే ఈ సినిమా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మిక్సింగ్, వీఎఫ్‌ఎక్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో ఈ సినిమాను విడుదల చేద్దామని బృందం భావిస్తున్నారట. అయితే, ఈ లోపే హాట్‌స్టార్ ఈ ప్రతిపాదనను ముందుకు తేవగా. అక్షయ్ కుమార్ దాన్ని తిరస్కరించినట్లు సమాచారం. మరి చిత్ర నిర్మాతలు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-04-25T22:26:41+05:30 IST