‘జయేష్ భాయ్ జోర్దార్’లో 100 శాతం పెర్ఫామెన్స్ ఇచ్చాను : షాలినీ పాండే

ABN , First Publish Date - 2020-03-08T18:56:28+05:30 IST

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్‌లో అరంగ్రేటం చేయబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’లో...

‘జయేష్ భాయ్ జోర్దార్’లో 100 శాతం పెర్ఫామెన్స్ ఇచ్చాను : షాలినీ పాండే

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్‌లో అరంగ్రేటం చేయబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’లో అతని సరసన జోడీగా ఛాన్స్ కొట్టేసింది.


ఇటీవల షాలిని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఇందులో కొన్ని సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది, నేను ఈ సినిమాలో వంద శాతం పెర్ఫామెన్స్ ఇచ్చాను’’ అని చెప్పింది.

‘జయేష్ భాయ్ జోర్డార్’లో రణ్వర్ సింగ్ సమాజంలో స్తీలకు సమాన హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరిలో  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - 2020-03-08T18:56:28+05:30 IST