ఏఆర్‌ రెహ్మాన్‌కు జీఎస్టీ కమిషన్‌ నోటీస్

ABN , First Publish Date - 2020-02-14T17:11:56+05:30 IST

ఏఆర్‌ రెహ్మాన్‌కు జీఎస్టీ కమిషన్‌ నోటీస్

ఏఆర్‌ రెహ్మాన్‌కు జీఎస్టీ కమిషన్‌ నోటీస్

స్టే ఇచ్చిన మద్రాసు హైకోర్టు 

చెన్నై: తాను సమకూర్చిన పాటలను సినీ నిర్మాతలకు పేటెంట్‌ హక్కులను కల్పించినందుకుగాను, సేవా పన్ను, జీఎస్‌టీ పన్ను ఏఆర్‌ రెహ్మాన్‌ చెల్లించాలంటూ జీఎన్‌టీ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసును రద్దు చేయమని రెహ్మాన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటీషన్‌లో... పాటలకు సంబంధించిన పేటెంట్‌ హక్కులను నిర్మాతలకు అప్పగిస్తే వారే ఎలాంటి పన్నులైనా చెల్లించాల్సి ఉంటుందని, అయితే తనకు జీఎస్‌టీ కమిషనర్‌ నోటీసు జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, రెహ్మాన్‌కు పంపిన నోటీసుపై మార్చి 4వ తేదీ వరకు జీఎస్‌టీ కమిషనర్‌ ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే విధించారు. అంతే కాకుండా ఈ పిటీషన్‌పై రెండు వారాల్లోగా కౌంటర్‌ అఫిడివిట్‌ దాఖలుచేయాలని న్యాయమూర్తి జీఎస్‌టీ కమిషనర్‌కు నోటీసు జారీ చేశారు.

Updated Date - 2020-02-14T17:11:56+05:30 IST