జయంతి తొలి భర్త ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-07-12T20:20:43+05:30 IST

కథానాయికల్లో మూడు పెళ్లిళ్లు చేసుకొన్న వారు అరుదు. పాత తరం కథానాయిక లక్ష్మి, జయంతి, రాధిక...

జయంతి తొలి భర్త ఎవరో తెలుసా?

కథానాయికల్లో మూడు పెళ్లిళ్లు చేసుకొన్న వారు అరుదు. పాత తరం కథానాయిక లక్ష్మి, జయంతి, రాధిక... ఇలా. జయంతి విషయానికి వస్తే ఆర్టిస్టుగా ఆమె వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగినా, వైవాహిక జీవితం మాత్రం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. జయంతి అసలు పేరు కమలకుమారి. ఆమె పేరును మార్చింది నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్‌. ఆమె మొదటి భర్త ఆయనే! ‘లవకుశ’లో సీత పక్కన ఉండే చెలుల్లో ఒకరిగా, ‘జగదేకవీరుని కథ’లోని నలుగురు నాయికల్లో ఒకరిగా... ఇలా చిన్న చిన్న వేషాలు వేస్తున్న కమలకుమారి పేకేటి దృష్టిని ఆకర్షించారు. ఆమె  తల్లి సంతానలక్ష్మిని ఒప్పించి కమలను పెళ్లిచేసుకున్నారు పేకేటి. ఆయనకు అప్పటికే పెళ్లి అయి, పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత జయంతిని తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు పేకేటి. ఈ దంపతులకు ఓ కొడుకు కూడా. కొన్నేళ్ల తర్వాత మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ‘చందన’ చిత్ర నిర్మాత బండారు గిరిబాబును పెళ్లి చేసుకొన్నారు జయంతి. ఆయనకు కూడా ఇది రెండో పెళ్లే. కొంత కాలం తర్వాత గిరిబాబు, జయంతి విడిపోయారు. ఇక ఆమె మూడో భర్త రాజశేఖర్‌ ఆమె కంటే 25 ఏళ్లు చిన్నవాడు. రాజశేఖర్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా తీశారు జయంతి. ఈ వివాహమూ మూడునాళ్ల ముచ్చటే అయింది.              - వినాయకరావు 

Updated Date - 2020-07-12T20:20:43+05:30 IST