డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్

ABN , First Publish Date - 2020-10-27T16:51:16+05:30 IST

దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని సూచించారు.

డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్

ఆదిలాబాద్ జిల్లా: దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని సూచించారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ  టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ట్రిపుల్ ఆర్ సినిమాలో భీమ్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఈ నెల 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది. అందులో భీమ్ టకియాను ధరించడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చిరస్తున్నాయి.  

Updated Date - 2020-10-27T16:51:16+05:30 IST